నేను కిడ్నాప్ అయ్యాను మూవీ రివ్యూ

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో  దగ్గుబాటి  వరుణ్ సమర్పణలో  మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం ‘నేను కిడ్నాప్ అయ్యాను’. విభిన్నమైన కాన్సెప్ట్.. ఎంటర్ టైన్ మెంట్ తో ఈ చిత్రం తెరకెక్కిందని చిత్ర నిర్మాతలు చెబుతున్నారు. క్లీన్ యూ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.  

కథ విషయానికి వస్తే….. ఓ యంగ్ టీం రూపొందించిన ప్రాజెక్ట్ వర్క్ ను సాఫ్ట్ వేర్ టైకూన్ ధూబే (పోసాని) దొంగిలించేసి క్యాష్ చేసుకొని చీట్ చేస్తాడు. దీంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గా తమ సత్తా చాటుదామనుకున్న టీం కుంగి పోతుంది. ఎలాగైనా ధూబేకు బుద్ది చెప్పాలని డిసైడ్  అవుతారు. దీని కోసం ధూబేను కిడ్నాప్ చేసినట్టుగానే భ్రమింపజేస్తూ… అలజడి సృష్టిస్తారు. ఇంతకూ ధూబేను సాప్ట్ వేర్ టీం కిడ్నాప్ చేసిందా లేదా.. తమ ప్రాజెక్ట్ ను దక్కించుకున్నారా లేదా అన్నది అసలు కథ. 

సమీక్ష

దర్శకుడు మంచి స్టోరీ లైన్ రాసుకున్నారు. సాధారణంగా ఈ తరహా సంఘటనలు మనం వింటుంటాం. అలాంటి స్టోరీని కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అంతా కొత్త నటీనటులైనా చాలా బాగా చేశారు. పోసాని కృష్టమురళి బాగా ప్లస్ పాయింట్ ఆయ్యాడు. ఆయన చుట్టూనే కథ తిరుగుతుంది. విలనీ షేడ్ లోనూ కామెడీ పండించాడు. బ్రహ్మానందం తనదైన స్టైల్లో నవ్వించాడు. పృథ్వీ, రఘు బాబు కామెడీ కొత్తగా ఉంది. 

తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్ మధ్య మధ్యలో తమ కామెడీతో ఆకట్టుకున్నారు. దర్శకుడు శ్రీకర బాబు ట్విస్టులతో పాటు హాస్యం పండించేందుకు ట్రై చేశాడు. కార్టూనిస్ట్ మల్లిక్ పోలీస్ ఆఫీసర్ గా కొత్తగా కనిపించారు. సత్య, కోట శంకర రావు, సత్యానంద్, శ్రీకాంత్, ధీరేంద్ర, హర్ష కృష్ణ మూర్తి, విశాల్   , సౌమిత్రి  , మహిమ కొఠారి, అదితి సింగ్ , దీక్షిత పార్వతి , తేజు రెడ్డి ,బిందు బార్బీ , సప్నా ఇంపార్టెంట్ పాత్రల్లో మెప్పించారు. 

టెక్నికల్ గా శ్రీకాంత్ అందించిన పాటలు బ్యాక్ గ్రౌండ్ స్టోర్ ప్లస్ అయ్యింది. కెమెరా వర్క్ బాగుంది. నిర్మాత మాధవి అద్దంకి ఖర్చుకు వెనకడాలేదు. దివాకర్ బాబు స్క్రీన్ ప్లే కూడా ప్లస్ అయ్యింది.  మల్లిక్ డైలాగ్స్ బాగున్నాయి. డిఫరెంట్ సినిమాల్ని చూడాలనుకునే ప్రేక్షకులకు మంచి ఛాయిస్ నేను కిడ్నాప్ అయ్యాను. 

PB Rating : 2.75/5