నేను లేను మూవీ రివ్యూ….

ఈ చిత్రం ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా కట్ చేయడంలో ఆందరిలోనూ ఆసక్తి పెరిగింది. అందులోనూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ విషయంలో దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ప్రేక్షకుల్ని మెప్పించాలంటే కొత్త తరహా కథ, కథనం ఉండాల్సిందే. ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత కొత్తదనం ఉండే సినిమాలాగే అనిపించింది.
ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సంయుక్తంగా సుక్రి కుమార్ నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేను లేను`… `లాస్ట్ ఇన్ లవ్` అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రామ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వేసిన ప్రీమియర్ షో రివ్యూ చూద్దాం.

కథేంటంటే : ఈశ్వర్(హర్షిత్) కర్నూల్ లో వీడియోలు తీస్తుంటాడు. డిఫరెంట్ వీడియోలతో, పబ్లిక్ ఇంట్రస్టింగ్ టాపిక్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంటాడు. అలాంటి సందర్భంలో పార్వతి(శ్రీపద్మ)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆమె ప్రేమను పొందేందకు బాగా ట్రై చేసి సక్సెస్ సాధిస్తాడు. వీరి ప్రేమ చిగురించి హ్యాపీగా సాగుతున్న సమయంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఇంటి నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎవరికీ చెప్పకుండా చేసుకుందామని డిసైడ్ అవుతారు. అదే సమయంలో వీరి మీదకు ఓ ఎటాక్ జరుగుతుంది. ఆ ఎటాక్ లో ఈశ్వర్ అనుకోని పరిస్థితుల్లోకి వెళ్తాడు. సైకలాజికల్ గా బాగా డిస్ట్రబ్ అవుతాడు. దాంతో ఎదుటివారికి ఏం జరుగుతుందో అర్థం కాదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంతకూ ఈశ్వర్ పై ఎటాక్ చేసిందెవరు. వారిని ఈశ్వర్ ఏం చేశాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేలింది. సైకలాజికల్ గా ఈశ్వర్ ఎలా డిస్ట్బర్బ్ అయ్యాడు. తదనందర పరిణామాలేంటి. ఈ విషయాలు తెలియాలంటే మాత్రం నేను లేను సినిమా చూడాల్సిందే.

సమీక్ష
థ్రిల్లర్ జోనర్స్ తో ఈ తరహా కథ, కథనం మాత్రం రాలేదనే చెప్పాలి. ఎందుకంటే అంత ఈజీగా అర్థమయ్యే కథ మాత్రం కానీ. దర్శకుడు తనదైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయగలిగాడు. కాంప్లికేటెడ్ స్టోరీని ప్రేక్షకులకు అర్థమయ్యే స్క్రీన్ ప్లే తో ప్రయోగం చేశారు. హీరోకు వచ్చే ఓ సైకలాజికల్ డిజార్డర్ ను దర్శకుడు రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె. బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ డిజార్డర్ వచ్చే క్రమం కూడా బాగుంది. ఈ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. స్క్రీన్ ప్లేలో చూపించిన ఫైట్ సీక్వెన్స్ అదిరింది. రొటీన్ కథ, కథనం కాకుండా కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. డిఫరెంట్ సీన్స్ ప్లాన్ చేశాడు కాబట్టి… గతంలో ఎక్కడా చూసిన విధంగా అనిపించదు. సాధారణంగా ఈ తరహా స్క్రీన్ ప్లే హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటాం. Cotard Syndrome సైంటిఫిక్ డిజార్డర్ గురించి బాగా చెప్పాడు. టైటిల్ కు తగ్గ కథ, కథనం కుదిరాయి. అందుకే ప్రేక్షకులు కథలోకి లీనమవుతాడు. దీనికి తోడు ఓ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. అవసరమైన చోట రొమాంటిక్ సీన్స్ తో వేడెక్కించాడు. హీరో హీరోయిన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ బాగా కుదిరింది. అందుకే సీన్స్ అంత బాగా వచ్చాయి. లవ్ సీన్స్ ని దర్శకుడు బాగా రాసుకున్నాడు. ఇద్దరి మధ్య మంచి ఎమోషన్ కుదిరింది. రియల్ లవ్ కపుల్ లా అనిపించారు. దర్శకుడు ఇంకాస్త ముందుకెళ్లి డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో సీన్స్ పండించాడు. ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. తర్వాత ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగారు.

హీరో హర్షిత్ సైకలాజికల్ డిజార్డర్ తో బాధ పడే యువకుడిగా బాగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్ లోనూ ఇంటెన్సిటీ చూపించాడు. అలాగే లవర్ బాయ్ గా హీరోయిన్ తో మంచి కెమిస్ట్రీ మెయింటైన్ చేశాడు. హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ లోనూ బాగా చేశాడు. ఎమోషన్ బాగా క్యారీ చేసాడు. హీరోయిన్ శ్రీపద్మ అందం అభినయంతో ఆకట్టుకుంది. పెర్ ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. హీరోతో పెయిర్ బాగా సెట్ అయ్యింది. డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన కుర్రాడు సైతం చాలా బాగా నటించాడు. క్లైమాక్స్ లో అతని నటన బాగుంది.
మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్ గా సినిమా హై ఎండ్ లో ఉంటుంది. ఆశ్రిత్‌ అందించిన పాటలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ఛాయాగ్ర‌హ‌ణం. ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ) తన లైటింగ్ తో మెస్మరైజ్ చేశాడు. చాలా సీన్స్ తో తన ప్రతిభ చూపించాడు. లిమిటెడ్ బడ్జెట్ లో గ్రాండియర్ విజువల్స్ అందించాడు. నిర్మాత సుక్రి కుమార్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా…
ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడని సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చారు కాబట్టి ప్రేక్షకుల్ని మెప్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్టిస్టులు కొత్త వారైనప్పటికీ పెర్ ఫార్మెన్స్ తో మెప్పించారు. ఒక అందమైన ప్రేమకథతో తెర‌కెక్కిన‌ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది.. ఇందులోని థ్రిల్లర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆధ్యంతం ఉత్కంఠకు గురి చేస్తాయి. ఈ సినిమాలో న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా. ముఖ్యంగా యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలెక్కువగా ఉన్నాయి. సో గో అండ్ వాచిట్.

PB Rating : 3/5