వాచ్ ట్రైలర్ – శైల‌జ రామ్ జాత‌కం మార్చేలాగే ఉందే..!

అభిమానుల‌కు భారీగా బాకీ ప‌డిపోయాడు రామ్. ఆ బాకీ తీర్చుకోడానికి నానా తంటాలు ప‌డుతున్నాడు ఇప్పుడు. అప్పుడెప్పుడో నాలుగేళ్ల కింద వ‌చ్చిన కందిరీగ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు రామ్ కి ఒక్క స‌క్సెస్ కూడా లేదు. మొన్నొచ్చిన పండ‌గ చేస్కో యావ‌రేజ్ అనిపించుకుంది త‌ప్ప హిట్ గీత దాటలేక‌పోయింది. ఇక శివ‌మ్ ధాటికి కుదేలైపోయాడు రామ్. ఒక‌ప్పుడు 20 కోట్లు ఉన్న రామ్ మార్కెట్.. వ‌ర‌స ఫ్లాపుల‌తో 10 కోట్ల‌కు ప‌డిపోయింది. ఈ మధ్య కాలంలో క‌నీసం ఒక్క హిట్ కూడా లేక అల్లాడిపోతున్నాడు ఈ కుర్ర‌హీరో. ఇలాంటి టైమ్ లో రామ్ లో ఆశ‌లు క‌ల్పిస్తున్న సినిమా నేను శైల‌జ‌.

కొత్త ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల నేను శైల‌జ‌ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. జ‌న‌వ‌రి 1న ఈ చిత్రం విడుద‌ల కానుంది. రామ్ కు జోడీగా కీర్తి సురేష్ న‌టించింది. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు యాక్ష‌న్ ల‌వ్ స్టోరీస్ చేసిన రామ్.. ఇప్పుడు త‌న వ‌య‌సుకు త‌గ్గ పాత్ర‌లో ప‌క్కా ప్రేమ్ క‌హానీతో వ‌స్తున్నాడు. నేను శైల‌జ ట్రైల‌ర్ కూడా చాలా ఫ్రెష్ గా క‌నిపిస్తుంది. ఈ సారి ఏదో మాయ చేసేలాగే క‌నిపిస్తున్నాడు ఈ ఎన‌ర్జిటిక్ స్టార్.

సెకండ్ హ్యాండ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన కిషోర్ తిరుమ‌ల‌.. ఇప్పుడు రామ్ తో త‌న సెకండ్ సినిమా చేస్తున్నాడు. ప్ర‌యోగాల జోలికి వెళ్ల‌కుండా.. 100 ప‌ర్సెంట్ ల‌వ్ స్టోరీతో నేను శైల‌జ తెర‌కెక్కింది. ఈ సినిమాపై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు రామ్. మ‌రి చూడాలిక‌.. ట్రైల‌ర్ లో క‌నిపించిన హిట్ క‌ళ‌.. రేపు థియేట‌ర్స్ లో కూడా క‌నిపిస్తుందో లేదో..?