సాంగ్స్ రికార్డింగ్ లో నేత్ర

శ్రీ లక్ష్మీ భవాని ఫిలింస్ పతాకంపై ఎస్.ఎస్. స్వామి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రివెంజ్ హార్రర్ నేత్ర. ఈ చిత్రం సాంగ్స్ రికార్డింగ్ ఇటీవలే హైదరాబాద్ లోని రాగా స్టూడియోలో వైభవంగా జరిగాయి. రవివర్మ సంగీత సారధ్యంలో మాళవిక, గీతామాధురి, నేహ, రవివర్మ తదితరులు గీతాలను ఆలపించారు. 

ఈ సందర్భంగా దర్శక నిర్మాత ఎస్.ఎస్.స్వామి మాట్లాడుతూ.. ఇదొక డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న వెరైటీ చిత్రమిది. గతంలో సక్సెస్ సాధించిన అరుధతి, కాంచన, చంద్రముఖి చిత్రాల తరహాలో వైవిధ్యంగా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగనుంది. మే రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. అన్నారు.