కొత్త ఇసుక పాలసీ అవినీతికి చెక్ -మంత్రి హరీష్ రావు

 గనులు మరియు భూగర్భ శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు 1915-16 ఆర్థిక సంవత్సరములో శాఖకు విధించిన 3500 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు సచివాలయములో నిర్వహించిన ఈ సమావేశములో శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ శ్రీ ప్రదీప్ చంద్ర, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఎండి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశములో రాష్ట్రములో కొత్తగా ప్రవేశపెట్టిన ఇసుక పాలసీ అమలు తీరుతెన్నులను కూలంకశంగా చర్చించారు. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా అనుకున్న విధముగా గత సంవత్సరం 90% లక్ష్యాన్ని అందుకోగలిగామని ఉన్నతాధికారులు వివరించారు. సీనరేజి చార్జీల  సవరింపు విషయములో ఒక కమిటీని నియమించి కమిటీ సిఫారసుల మేరకు సవరించాలని నిర్ణయించడం జరిగింది. Granite quarrying విషయములో శ్లాబ్ సిస్టమ్ ను అమలు పరచాలని నిర్ణయించారు.

గతములో దాకలు చేసిన విజిలెన్స్ కేసులపై one time settlement చేసుకోవడానికి వీలుగా అధికారిక ఉత్తర్వులను జారీచేయాలని నిర్ణయించారు. బిల్డర్స్ చార్జెస్ కింద చదరపు అడుగుకి 3 రూపాయలను వసూలు చేయాలని అందుకు త్వరలోనే ఉత్తర్వులు జారీచేయాలని నిర్ణయించారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఖమ్మం జిల్లా బయ్యారములో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని నిర్ణయించారు. గనులు భూగర్భ శాఖలో staffing pattern ను సవరించడానికి, విస్తరించడానికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని అధికారులు తెలియజేశారు. పట్టాభూముల్లో ఇసుక తవ్వకానికి సంబంధించి కొత్త నియమ నిబంధనలు రూపొందించాలని నిర్ణయించారు. వీటికి సంబందించి ఇప్పటికీ 120 కేసులలో NOC లు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. మిగత పెండింగ్ కేసులను రాబోయే 3 నెలలలో పరిష్కరిస్తామని వారు మంత్రిగారికి తెలిపారు. కొత్త ఇసుక పాలసీని పకడ్బందీగా, పారదర్శకంగా అవినీతికి తావు లేకుండా అమలుపర్చాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

prees note