సవితా బార్బీగా గెహనా వశిష్ట్‌

తెలుగులో అనుకున్నదొకటి అయ్యిందొకటి, నమస్తే, బి.టెక్‌ లవ్‌స్టోరీ, ఐదు, ప్రేమించు పెళ్లాడు తదితర చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన గెహనా వశిష్ట్‌ కేవలం హీరోయిన్‌ పాత్రలకే పరిమితం అవ్వకుండా 33 ప్రేమకథలు, హ్యాపీడేస్‌ రిటర్న్స్ వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నర్తించి బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది. హీరోయిన్‌గానే కాకుండా మోడల్‌గాను, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోన్న ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీలో ఆర్‌పిపిఎల్‌ బ్యానర్‌పై సవితా బార్బీ 3డి చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యింది. వెబ్‌`రిలీజ్డ్‌ యానిమేటెడ్‌ మూవీస్‌లో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా చరిత్రలో నిలిచిన మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ అడల్ట్‌ క్యారెక్టర్‌ ఈ సవితా బార్బీ. గ్లామర్‌ మరియు పెర్‌ఫార్మెన్స్‌ వున్న ఈ 3డి మూవీలో నటిగా తన స్థాయి పెరుగుతుందని గెహనా ఆకాంక్షిస్తోంది. సవితా బార్బీ క్యారెక్టర్‌ని పోషించబోతున్న గెహనా విశిష్ట్‌పై హాట్‌ ఫొటోషూట్‌ చేసారు. ఇటీవల ఆ ఫొటోలు ఇంటర్నెట్‌లో విడుదల చేసారు. ప్రస్తుతం షోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌లోను, వెబ్‌సైట్స్‌లోను గెహనా హాట్‌ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి.