ఆ హీరోయిన్‌కు ఐటెం సాంగ్ ఛాన్స్…మాటిచ్చిన పవన్‌కళ్యాణ్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కొమరం పులి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నికిషాపటేల్ ఈ సినిమా ప్లాప్ కావడంతో తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. కళ్యాణ్‌రామ్ ఓంతో పాటు కొన్ని కన్నడ చిత్రాల్లో చేసినా ఆమెకు అనుకున్న బ్రేక్ రాలేదు.

ప్రస్తుతం తమిళ్, కన్నడ సినిమాల్లో నటిస్తోంది. నికిషాకు ఇటీవల కొన్ని ఐటెం సాంగ్స్‌లో చేసే ఛాన్స్ వచ్చినా తిరస్కరించింది. తనకు పవన్ సార్ గబ్బర్‌సింగ్-2 సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చాడని చెపుతోంది. 

పవన్ గబ్బర్‌సింగ్-2లో నికిషాతో ఓ ఐటెం సాంగ్ చేయించాలని డిసైడయ్యాడట. దీంతో ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా… తనకు పవన్ ఇచ్చిన మాట ఆయన ఎప్పుడు నెరవేరుస్తారా అని నికిషా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తోంది.