నిఖిల్ కోరిక తీర్చిన కోన‌వెంక‌ట్…..

వ‌ర‌స‌గా విజ‌యాలు వ‌స్తున్నాయి గానీ.. ఆ సంతోషం నిఖిల్ మొహంలో మాత్రం క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అదే డాన్స్. నిఖిల్ కు డాన్స్ అంటే ప్రాణం. ఈయ‌న కెరీర్ మొద‌ట్లో చేసిన అన్ని సినిమాల్లోనూ డాన్స్ కు పెద్ద‌పీట వేసారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. కానీ స్వామిరారా త‌ర్వాత నిఖిల్ మైండ్ సెట్ మారింది. డాన్స్ కంటే క‌థ ముఖ్య‌మ‌ని తెలుసుకుని వ‌ర‌స‌గా విభిన్న‌క‌థ‌ల‌కే ఓటేసాడు. అలా చేసిన సినిమాలే స్వామిరారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య‌. ఈ సినిమాల‌న్నీక‌థాప్ర‌ధాన‌మైన‌వే. దాంతో ఇందులో డాన్స్ చేయాల్సిన అవ‌స‌రం నిఖిల్ కు రాలేదు.

కానీ ఇప్పుడు న‌టిస్తున్న శంక‌రాభ‌రణంతో త‌న కోరిక తీర్చేసుకుంటున్నాడు నిఖిల్. ఇందులో అద్భుత‌మైన ఫాస్ట్ బీట్ కు చిందేస్తున్నాడు నిఖిల్. ఈ పాటను ప్రేమ్ ర‌క్షిత్ కొరియోగ్ర‌ఫీ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఆర్ ఎఫ్ సీలో ఈ పాట చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. శంక‌రాభ‌ర‌ణంలో నిఖిల్ స‌ర‌స‌న నందిత న‌టిస్తుంది. అంజ‌లి ప్ర‌ధాన‌పాత్ర‌లో క‌నిపించ‌నుంది. మొత్తానికి ఇన్నాళ్ళ‌కు కోన‌వెంక‌ట్ ద్వారా త‌న కోరిక తీర్చుకుంటున్నాడు నిఖిల్.