కరుణాకరణ్, నితిన్, మిస్తీ సినిమా సెట్స్ పైకి

యంగ్‌ హీరో నితిన్ కధానాయకుడిగా  ప్రేమకధా చిత్రాల స్పెషలిస్ట్‌ కరుణాకరన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రేస్ట్ మూవీస్ పతాకం మీద నిఖితారెడ్డి, సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విక్రమ్‌ గౌడ్ సమర్పకులు. నితిన్ సరసన బాలీవుడ్‌ కథానాయిక మిస్తీ జోడి కడుతోంది. జూన్ 2 న  చిత్రీకరణ ప్రారంభించుకునే ఈ సినిమా ఇండియాతో పాటు అబ్రాడ్లోనూ భారీ వ్యయంతో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ నెల 21 న ఈ సినిమా పూజా కార్యక్రమాలను లాంచనంగా జరుపుతామని…శ్రేస్ట్ మూవీస్‌లో గతంలో వచ్చిన ఇష్క్, గుండెజారి గల్ల౦తయ్యి౦దే లా౦టి విజయాల అన౦తర౦ తీస్తున్న ఈ మూడో సినిమా కూడా గ్రాండ్‌ సక్సెస్‌ అవుతుందని నిర్మాత నికితా రెడ్డి తెలిపారు. 

ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, 

సంగీతం: అనుప్ రూబెన్స్, 

సినిమాటోగ్రఫి: ఆండ్రూ,

ఆర్ట్ – రాజీవ్ నాయర్ ,

సమర్పణ: విక్రమ్‌ గౌడ్‌.