విప్ చింత‌మ‌నేనిపై నాన్‌బెయిల్‌బుల్ కేసు…అధిష్ఠానం సీరియ‌స్‌

ఏపీ ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై కృష్ణి జిల్లా ముసునూరు పోలీస్‌స్టేష‌న్‌లో నాన్‌బెయిల్‌బుల్ కేసు న‌మోదైంది. ప్ర‌భాక‌ర్‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు మొత్తం 52 మందిపై ఈ కేసు న‌మోదైంది. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వ‌న‌జాక్షి ఫిర్యాదు మేర‌కు ఈ కేసు న‌మోదైంది. బుధ‌వారం రాత్రి ముసునూరు మండ‌లం రంగంపేట‌లో అక్ర‌మ ఇసుక త‌వ్వ‌కాల‌ను అడ్డుకున్నందుకు గాను ప్ర‌భాకర్ ఆయ‌న అనుచ‌రుల‌తో క‌లిసి త‌న‌పై దాడి చేశార‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మార్వో వనజాక్షితో పాటు ఆమె వెంట వచ్చిన రెవెన్యూ సిబ్బందిపైనా చింతమనేని అనుచరులు దాడి చేశారు. జరిగిన ఘటనపై ఎమ్మార్వో వనజాక్షి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేనిపై పోలీసులు ఐపీసీ 353, 334, 379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తనపై దాడి చేసి, తనను ఈడ్చేసి, తన ఫోన్ కూడా లాక్కుని విసిరేశారని తహశీల్దార్ వనజాక్షి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘ‌న‌ట‌లోనే ఓ ప్ర‌ధాన ప‌త్రిక విలేక‌రిపై కూడా చింత‌మ‌నేని అనుచ‌రులు దాడి చేశారు. ఎమ్మార్వో ఫిర్యాదుతోఎమ్మెల్యే సహా 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై టీడీపీ అధిష్ఠానం కూడా సీరియస్‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.