అమెరికా అధ్యక్షుడు ఆఫ్రికా కోతి… ఉత్తర అమెరికా ధ్వజం

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను ఉత్తర అమెరికా ఆఫ్రికా కోతిగా అభివర్ణించింది. ఆ దేశ జాతీయ రక్షణ మండలి ప్రతినిధి ఒకరు ఒబామాపై ఈ విమర్శలు చేశారు. ఇందుకు ఒక సినిమా కారణమైంది. అమెరికాకు చెందిన సోనీ పిక్చర్స్ సంస్థ క్రిస్మస్ సందర్భంగా ది ఇంటర్వ్యూ సినిమాను థియేటర్లతో పాటు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఇందులో కథాంశం ఏంటంటే ఉత్తర కొరియా రాజు కిమ్ జోంగ్ యున్‌ను చంపే పథకాన్ని హాస్యంగా చిత్రీకరించారు. సహజంగానే ఇది ఆ దేశ పాలకులకు ఆగ్రహాన్ని తెప్పించింది. క్రిస్మస్ పండగ పురస్కరించుకుని ఒబామా మద్దతుతోనే ఈ సినిమాను విడుదల చేసినట్టు భావించిన ఉత్తర కొరియా ఈ సినిమా ప్రదర్శనను ఆపేసింది. దీంతో అక్కడ సోనీ పిక్చర్ సినిమాను ఆపేసింది. అయితే గత వారం రోజులుగా పోలీసులు ఉత్తర కొరియా వ్యాప్తంగా సైబర్ దాడులు ముమ్మరం చేసి నెట్‌లో కూడా సినిమాను చూడకుండా అడ్డుకుంటున్నారు.