డెట్రాయిట్ లో ఎన్నారై తెరాస, తెలంగాణ జాగృతి

మీట్ అండ్ గ్రీట్ మంత్రి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పేరిట డెట్రాయిట్ నగరంలో NRI తెరాస, తెలంగాణా జాగృతి నిర్వహించారు. ఈ సంధర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నారైల అండదండలు ఎప్పుడూ ఉండాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలతో ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ అభివృద్దికి పాటు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ను అందరూ తక్కువ అంచనా వేశారని, కానీ పాలనలో ఆయనతో పోటీ పడే వారు ఎవరూ లేరని తలసాని అన్నారు. తెలంగాణ అభివృద్దికి సంబంధించి కేసీఆర్ వద్ద ఖచ్చితమయిన ప్రణాళిక ఉందని, ప్రణాళికా బద్దంగా కేసీఆర్ ముందుకు వెళ్తున్న తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని ఆయన అన్నారు.

ప్రపంచంలో ఎక్కడ లేని విదంగా TS iPASS ద్వార పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపు అనుమతి లబిస్తుందని, మిషన్ కాకతీయ మంచి పలితాలిస్తుందని ఇప్పటికే పునరుద్దరణ చేయబడిన చెరువులు నిండుకుండల్లా మారాయని, రాష్ట్రంలో అనాధ పిల్లల కోసం చదువు, వసతి తదితర అంశాల పై ముఖ్యమంత్రి గారి చొరవ అభినందనీయమని అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ నగరాన్ని పరిశుభ్రంగా చేయడానికి మాత్రమే పరిమితం చేయకుండా ప్రతి బస్తీలో ప్రజల అవసరాలను తీర్చే కార్యక్రమంగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీర్చిదిద్దారని, హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఆరోగ్య లక్ష్మి, ఆసరా , హరితహారం, వాటర్ గ్రిడ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గృహ నిర్మాణం లాంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల ద్వార తెలంగాణ త్వరలో అభివృద్ధి చెందుతుందని, 13 నెలల కాలంలో ఇప్పటివరకు వున్న ఎ ప్రభుత్వం ద్వార ఇంత అభివృద్ధి జరగలేదన్నారు

కార్యక్రమాని కి TNEWS ఇన్పుట్ ఎడిటర్ పి.వి.శ్రీనివాస్, ప్రజా గాయకుడు గోరేటి వెంకన్న గారు, కవి సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ సినీ గాయకులు రామాచారి గారు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రవికాంత్ గారు, POW సంధ్య గారు కార్యక్రమం లో పాల్గొన్నారు.

నక్షత్రం ప్రొడక్షన్స్ సమర్పణలో, ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ అధినేత బాలకృష్ణ పొట్లూరి నిర్మాణ సారధ్యంలో డైరెక్టర్ వేణు నక్షత్రం తెరకెక్కించబోతున్న సినిమా ‘శ్రీగీతం’ చిత్రాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారి చేతుల మీదగా మూవీ టైటిల్ ను ఆవిష్కరించారు.

కార్యక్రంలో ఎన్ఆర్ఐ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నవీన్ కానుగంటి, నరసింహ నాగులవంచ, విజయ్ బొమ్మెన, సకృ నాయక్, బిందు రెడ్డి తెలంగాణా జాగృతి నాయకులు శ్రీధర్ భండారి, మురళి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి కలువల, ప్రవీణ్ కేసిరెడ్డి, రవీందర్ రెడ్డి గడ్డంపల్లి, ATA నాయకులు కరుణాకర్ అసిరెడ్డి గారు, పరమేష్ భీంరెడ్డి గారు, సతీష్ రెడ్డి గారు పాల్గొన్నారు.