8 ఫ్యాక్‌లో ఎన్టీఆర్..!

నిన్నటి వరకు 6 ఫ్యాక్ మానియా టాలీవుడ్ హీరోలకు పట్టింది. ఇప్పుడు కొత్తగా 8 ఫ్యాక్ వస్తోంది. ఇప్పటికే కొందరు హీరోలు దీనిపై దృష్టి పెట్టారు. బాలీవుడ్ హీరోలు 8 ఫ్యాక్ బాడీ షేప్‌పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ వంతు యంగ్‌టైగర్ జూన్టియర్‌కు వచ్చింది. ఎన్టీఆర్-పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న (వర్కింగ్ టైటిల్ టెంపర్) సినిమాలో ఎన్టీఆర్ 8 ఫ్యాక్‌లో కనిపిస్తాడట. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన ఇందులో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు.