ఎన్టీయార్ మహానాయకుడు మూవీ రివ్యూ

ప్రేక్షకుల్ని తనదైన సినిమాలతో మెప్పించిన ఎన్టీయార్, జనాల మనసులు దోచుకున్న రాజకీయ ఉద్దండుడు ఎన్టీయార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీయార్ కథానాయుకుడు, మహానాయకుడు. రెండు పార్టుల్లో ఈ సినిమా ఫినిష్ చేశారు. మొదటి పార్ట్ కథానాయకుడు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ముఖ్యంగా సినిమాల మీద కాన్ సన్ ట్రేట్ చేస్తూ.. పొలిటికల్ గా ఎన్టీయార్ ఎంట్రీ ఎలా అయ్యారో చూపించారు. రెండో భాగంలో ఆయన రాజకీయంగా ఎలా ఎదిగాడు, ముఖ్యమంత్రి ఎలా ఎయ్యాడు. నాదెండ్ల భాస్కర్ రావ్ వేసిన ఎత్తుగడలతో ముఖ్యమంత్రి పదవి ఎలా పోయింది. మళ్లీ ఎన్టీయార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి ఎత్తుగడలు వేశాడు, ఎన్టీయార్ భార్య తారకం మరణించడంతో సినిమా ముగుస్తుంది.

మహానాయకుడులో చెప్పిన విషయాలు జనాలకు పెద్దగా తెలియనివి కావు. రాజకీయాలు ఫాలో అయ్యేవారికి అందరికీ తెలిసిన విషయాలే. అయితే దర్శకుడు క్రిష్ ఈ నాటకీయ పరిణామాల్ని ఆసక్తికరంగా చూపించడంలో విఫలమయ్యాడు. ఎమోషనల్ సీన్స్ ని క్రిష్ బాగా తీయగలడని గత సినిమాలతో నిరూపించుకున్నాడు. కానీ ఈ సినిమా విషయంలో ఏమైందో కానీ స్లో నరేషన్, డాక్యుమెంటరీ ట్రీట్ మెంట్, సీరియల్ తరహా నత్తనడకన కథ ముందుకు సాగింది. ఒకట్రెండు సీన్స్ తప్ప మిగిలిన సీన్స్ అంతా బోరింగ్ గా సాగాయి. బాలకృష్ణ కనుసన్నల్లో నడిచిన ఈ సినిమా కథ అంతా చంద్రబాబును హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. నాదెండ్ల భాస్కర్ రావును విలన్ గా చూపించడంలో సక్సెస్ అయ్యారు. ఎన్టీయార్ వీక్ నెస్ ను చూపించడంలో సఫలమయ్యారు.

నిజానికి ఎన్టీయార్ జీవితంలో ముఖ్యమైన ఘట్టం లక్ష్మీ పార్వతి ఎంటర్ అయిన తర్వాతే. అసలు అప్పుడు ఏం జరిగింది తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఎక్కువగాఉంది. వైస్రాయ్ హోటల్ లో ఏం జరిగిందనే క్యూరియాసిటీ ఉంటుంది. కానీ బాలకృష్ణ ఆ విషయాల జోలికి వెళ్లకుండా ఎన్టీయార్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడం వరకు మాత్రమే చూపించి వదిలేశారు. అందుకే అసంతృప్త బయోపిక్ గా మిగిలింది. ఈ సినిమాలో నిజా నిజాలు ఎంతున్నాయో తెలీదు కానీ… మట్టి అంటకుండా…. ఎన్టీయార్ నిస్సహాయతను, ఉన్న చంద్రబాబు సమర్థతను చూపించే ప్రయత్నం చేశారు. వన్ సైడెడ్ స్టోరీగా అనిపించింది. పొలిటికల్ గా ఉంటే ఎమోషనల్ పాయింట్ ను ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ కాలేకపోయారు. పొలిటికల్ డ్రామా ఉండే సినిమాల్లోని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, సీన్స్ ఇందులో కనిపించలేదు.

ఓవరాల్ గా… ఎన్టీయార్ బయోపిక్ ను అసంతృప్త బయోపిక్ గా ముగించారు. రెండు పార్టులు కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. కథానాయకుడు ఓ వర్గం ప్రేక్షకుల్ని కనీసం ఓకే అనిపించేలా చేసింది. కానీ మహానాయకుడు ఏ వర్గాన్ని కూడా మెప్పిస్తుందనే నమ్మకం మాత్రం కనిపించట్లేదు.

Rating : 2/5