ఇండియా-పాక్ మ్యాచ్‌లో ఎన్టీఆర్ టెంపర్

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఎట్టకేలకు ఉత్సాహంతో ఉన్నారు. ఆయన ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న హిట్ టెంపర్ రూపంలో దక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టెంపర్ హడావిడి బాగా ఉంది. అయితే ప్రపంచకప్‌లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య అడిలైడ్‌లో జరిగిన మ్యాచ్‌లో కూడా టెంపర్ హడావిడి కనిపించింది.

మ్యాచ్‌లో ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిమానులు కేరింతలు కొడుతున్నారు. అయితే ఇండియా జెండాలు టీవీ కెమేరాలకు ఎదురుగా పెట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. ఆస్ట్రేలియాలోని జూనియర్ ఫ్యాన్స్ టెంపర్ ఫ్లకార్డులు పట్టుకుని తమ అభిమాన నటుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

టెంపర్ సినిమా ఫ్లకార్డులు ఏకంగా వరల్డ్‌వైడ్‌గా వస్తున్న లైవ్ కవరేజ్‌లో కనిపించడంతో వరల్డ్‌వైడ్‌గా మ్యాచ్ చూస్తున్న వారితో పాటు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా జూనియర్‌కు ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేసింది. 

ఇదిలా ఉంటే ఓ వైపు వరల్డ్‌కప్ ఫీవర్ ఉన్నా టెంపర్ సినిమా తొలి రెండు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి కలెక్షన్లు రాబట్టింది. తొలి రోజు రూ 9.68 కోట్ల షేర్, రెండో రోజు రూ 4.5 కోట్లు వసూలు చేసింది.