రూట్ మ్యాప్ ఇస్తే టీడీపీకి ఎన్టీయార్ ప్రచారం

తాత ఎన్టీయార్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి చాలాకాలంగా దూరంగా ఉంటున్నాడు మనవడు జూనియర్ ఎన్టీయార్. అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రూట్ మ్యాప్ ఇస్తే ప్రచారం చేసేందుకు సిద్ధమౌతానని సన్నిహితులతో చెప్పాడట. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా పెట్టే ఆలచనలో ఉన్నట్టు సమాచారం. 

చంద్రబాబు, బాలకృష్ణలతో రాజకీయంగా పలు విషయాల్లో విభేధించడంతో ఎన్టీయార్ తో ఈ దూరం మరింత పెరిగింది. అంతేకాదు హరికృష్ణ విషయంలో బాబు, బాలయ్య అనుసరించిన విధానం కూడా ఎన్టీయార్ కు అస్సలు నచ్చలేదు. అంతేకాదు తెలుగు దేశం పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరిగుతోందని ఎంత మొత్తుకున్నా బాబు పట్టించుకోలేదని బుడ్డోడు అలిగాడు. అదేవిధంగా తన సినిమా పరాజయం కావాలని కార్యకర్తలు ఎస్ ఎమ్ ఎస్ లు పంపారని… ఇలా పలు విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీయార్ అంటీ ముట్టనట్టుగా ఉన్నాడు.