ఒబామా కూతురు పార్ట్ టైం జాబ్ …అమెరికాలో హాట్ టాపిక్‌

ఆమె అమెరికా అధ్య‌క్షుడి కుమార్తె. డ‌బ్బుకు కొద‌వేం ఉంటుంది. అయినా చ‌దువుతో పాటు పార్ట్ టైం జాబ్ చేస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు బార‌క్ ఒబామా కుమార్తె మాలియా ఇప్పుడ అమెరికాలో హాట్ టాపిక్ అయ్యింది. ఆమె వార్త‌ల్లో కెక్కింది. ఓ పార్ట్ టైమ‌ర్‌గా జాయినయ్యేందుకు డిసైడై శెభాష్ అనిపించుకుని అంద‌రి చేత ప్ర‌శంస‌లందుకుంటోంది.

17 ఏళ్ల మాలియా వ‌చ్చే ఏడాది డిగ్రీ పూర్తి చేసుకోనుంది. చదువుతోపాటే ఉద్యోగమూ చేస్తే అప్పటికే అనుభవం గడించొచ్చన్న ముందు చూపుతో ఈ విధంగా నిర్ణ‌యించుకుంద‌ట‌! టీవీ లేదా సినిమా వంటి ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకుంటానన్న మాలియా ఆ దిశగానే అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆమె హెచ్‌బీవో చానల్‌లో ప్రసారమయ్యే ‘గర్ల్స్’ సిరీస్‌లో తాత్కాలిక ఉద్యోగినిగా చేరిందట‌.