వైస్ కెప్టెన్‌గా రహానే, ఆశ్విన్…ఇషాంత్ అంటూ భువి ట్విట్

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ధోనీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో వైస్‌కెప్టెన్‌గా ఉన్న కోహ్లి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే ఖాళీగా ఉన్న వైస్‌కెప్టెన్ స్థానానికి అజ్యంకారహానే, ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ పేర్లు వినిపిస్తున్నాయి. టీమ్ మేనేజర్ రవిశాస్త్రి వైస్‌కెప్టెన్ ఎంపికలో కీలక పాత్ర పోషించనున్నారు. అశ్విన్ తన కేరీర్‌లో ఇప్పటి వరకు 23 టెస్టులు ఆడాడు. ఇక రహానే ఇప్పుడు టెస్ట్, వన్డే, 20-20 ఫార్మాట్‌లో కీలక సభ్యుడిగా మారాడు. దూకుడైన కోహ్లికి తోడుగా ప్రశాంతంగా ఉండే రహానే అయితే సరైన జోడీ అవుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే మరో ట్విస్ట్ ఏంటంటే వైస్‌కెప్టెన్ ఎంపికైన ఇషాంత్‌శర్మకు నా కంగ్రాట్స్ అంటూ భువనేశ్వర్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాకున్నా భువి తన ట్విట్టర్‌లో ఇషాంత్‌కు కంగ్రాట్స్ తెలిపాడు.