ఊల్లాలా ఊల్లాల చిత్రం అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే చిత్రం – నిర్మాత ఎ.గురురాజ్

సీనియర్‌ నటుడు సత్యప్రకాశ్‌ దర్శకుడిగా మారి, రూపొందిస్తున్న చిత్రం ‘ఊల్లాల ఊల్లాల’. రక్షకభటుడు, ఆనందం, లవర్స్‌ డే లాంటి చిత్రాలను అందించిన నిర్మాత ఎ. గురురాజ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటరాజ్, నూరిన్, అంకిత తదితరులు ముఖ్య తారలుగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్‌లో విడుదల కానుంది. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ని హీరో వెంకటేశ్‌ ఆవిష్కరించి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత గురురాజ్‌ మాట్లాడుతూ– సత్యప్రకాష్‌ నాకు మంచి మిత్రుడు. నటునిగా అతనిలో ఎంత ఫైర్‌ ఉందో, దర్శకునిగా అంతకు మించిన ఫైర్‌ ఉంది. ఈ చిత్రానికి నేనే కథను అందించాను. నిర్మాతగా నాకు, దర్శకునిగా సత్యప్రకాష్‌కు ఈ చిత్రం మంచి మలుపు అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే మెచ్చే చిత్రం అవుతుంది.’’ అని అన్నారు.

నటుడు సత్యప్రకాష్ మాట్లాడుతూ… ఈ సినిమా కోసం నిర్మాతగా గురురాజ్ హండ్రెడ్ పర్సండ్ న్యాయం చేస్తున్నారు. ఆయన ప్యాషన్ ఉన్న నిర్మాత. నన్ను 20 సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు నన్ను దర్శకుడిగా నా కొడుకును హీరోగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా టెక్నికలక్ గా చాలా క్వాలిటీగా ఉంటుంది. అందరినీ తప్పకుండా ఎంటర్ టైన్ చేస్తుంది అని అన్నారు.

హీరో నటరాజ్ మాట్లాడుతూ… నేను ఇక్కడ ఉన్నానంటే కారణం మా నాన్న. మా నాన్న ఇక్కడ ఉన్నారంటే కారణం ప్రేక్షక దేవుళ్లే. నన్ను కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నిర్మాత గురురాజ్ హెల్ప్ గురించి చెప్పలేను. ప్రతాని గారు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. నాన్న డైరెక్టర్ గా ఎంత పర్ఫెక్షన్ ఉందో ఈ సినిమాలో చూస్తారు. హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. నన్ను ఆశీర్వదించండి. అని అన్నారు.