ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానం… అందుకున్న తెలుగు పద్మాలు

ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. మదన్ మోహన్ మాలవ్యకు మరణానంతరం భరతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులకు భారతరత్న పురస్కారాని అందజేశారు. భాజాపా నేత అద్వాణీ, ప్రకాష్ సింగ్ బాదల్ తో సహా మొత్తం తొమ్మిది మందికి పద్మవిభూషణ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఇరవై మందికి పద్మ భూషణ్, డెబ్బై ఐదు మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన డా.మంజుల, క్రీడారంగంలో మిథాలి రాజ్, పివీ సింధు, కళా రంగంలో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పరస్కారాలను రాష్ట్రపతి నుంచి అందుకున్నారు.