సాయంలో వక్ర బుద్ధి… బీఫ్ పంపి పాక్ పాపం!

భూకంపంతో విలవిలాడుతున్న నేపాల్ కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. తోచినంతలో ఏదో రకంగా సాయం చేస్తున్నాయి. చాలా దేశాలు తిండితిప్పలు లేకుండా నిరసించిన నేపాళీలకు ఆహారాన్ని పంపుతూ ఆకలిని తీర్చుతున్నాయి. పక్కదేశమైన పాక్ కూడా ఆహార పదార్థాలను పంపించింది. అయితే సాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన పాక్.. అందులోనూ పాపాన్నే మూటగట్టుకుంది. ఎందుకంటే పాక్ పంపింది మామూలు ఆహారం కాదు.. నేపాల్ ప్రజలు అత్యంత పాపపు ఆహారంగా భావించే బీఫ్ ని..

హిందూ దేశమైన నేపాల్ లో ఎప్పటి నుంచో గోవధ నిషేదం అమల్లో ఉంది. గోవులను తమ ఆరాధ్య దైవంగా భావించే ఆ దేశం… అక్కడ ఎవరైన గోవధకు పాల్పడితే దాన్ని పెద్ద పాపంగా పరిగణిస్తారు. అలాంటి పనులకు పాల్పడిన వారికి 12 ఏళ్ల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఇది ప్రస్తుతం చిన్న శిక్ష. ఎందుకంటే 1990 కి ముందు గోవధకు పాల్పడిన వారికి ఏకంగా ఉరిశిక్ష వేసేవారు. ఆ భయంతో అక్కడి ప్రజలు బీఫ్‌ అనే మాటను కూడా పలకరు. అలాంటిది పాక్ తాజాగా నేపాల్‌కు బీఫ్ మాంసాన్ని సరికొత్త వివాదానికి తెరలేపింది..

పాక్ పంపిన ఆహార ప్యాకెట్లను పరిశీలించిన భారతీయ వైద్యులు.. విషయాన్ని నేపాల్ అధికారులకు చేరవేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది తెలిసిన నేపాల్ ప్రజలు పాక్ పంపిన ఆహారాన్ని అస్సలు ముట్టుకోవడం లేదని తెలుస్తోంది. మరోవైపు మేటర్ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలకు తెలియడంతో అంతర్గత విచారణ కూడా చేపట్టినట్టు సమాచారం..

తాజా వివాదం రాబోయే రోజుల్లో నేపాల్-పాకిస్థాన్ దేశాల ద్వైపాక్షిక సంబంధాల మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది.. అయినా ఎంత సాయం చేస్తే మాత్రం.. తెలిసి కూడా పాపం చేయించడం దుర్మార్గం.