పంతం రివ్యూ

కొన్ని సినిమాలు ట్రైలర్స్, సాంగ్స్ తో మంచి ఇంప్రెషన్ సంపాదిస్తాయి. అలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకున్న చిత్రం పంతం. గోపీచంద్ 25వ చిత్రంగా పంతం రూపొందించారు. గోపీచంద్ మనసుకు బాగా దగ్గరైన కథ ఇది. గోపీచంద్ గత సినిమాలు సరిగ్గా ఆడకపోయినా… నిర్మాతలకు ఆయన మీద నమ్మకం మాత్రం ఇంకా పోలేదు. అందుకే రాధామోహన్ మంచి బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించారు. చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రసాద్ మూరెళ్ల బ్యాక్ బోన్ గా నిలిచాడు. గోపిసుందర్ మ్యూజిక్, మెహ్రీన్ మ్యాజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా బజ్ క్రియేట్ చేశాయి. ఎంతో నమ్మకంతో ఈ సినిమా కథను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం. 

మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కథ ఇది. ఎక్స్ గ్రేషియా సరిగ్గా అందక సామాన్యులు ఎలా ఇబ్బంది పడుతున్నారనేది తరచుగా మనం వార్తల్లో వింటూనే ఉంటాం. టీవీల్లో చూస్తూనే ఉంటాం. ఈ ఎక్స్ గ్రేషియాల వెనక ఎంత మాఫియా రన్ అవుతుందనేది ఇందులో బాగా చూపించారు. హీరో క్యారెక్టరైజేషన్ ను రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మాదిరిగానే ఏం చేస్తుంటాడనేది చెప్పకుండానే…  ఏదో చేస్తాడులే అనుకునేలా… ఫస్టాఫ్ ని సరదాగా తీసుకెళ్లారు. హీరో తన పంతం నెగ్గించుకునేందుకు ఇందులో పృథ్వీని బకరాను చేస్తాడు. వాడకం ఏంటో చూపించారు. పృథ్వీ కామెడీతో సరదాగా నవ్వుకుంటారు. పృథ్వీ హీరో చేతుల్లో బుక్ కావడం… ఫన్నీగా ఉంటుంది. ఇక మధ్య మధ్యలో హీరోయిన్ మెరుపులు,అందచందాలు, పాటలు, లవ్ ట్రాక్స్ తో వెళ్తుంది. మరోవైపు హీరో తాను పంతం పట్టిన పనిని నెరవేర్చుకునేందుకు వాడుకునే స్క్రీన్ ప్లే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. విలన్ దగ్గరినుంచి డబ్బులు దొంగిలించే సీన్స్ తో దర్శకుడి టాలెంట్ చూపించుకున్నాడు. రాళ్లపల్లి తన భార్యతో గవర్నమెంట్ ఆఫీసుకు వచ్చి ఎక్స్ గ్రేషియా కోసం అభ్యర్థించడం…అక్కడే తన భార్య ఆత్మహత్య చేసుకునే సీిన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్స్. ఇంటర్వేల్ ట్విస్ట్ పెద్దగా లేకపోయినా… ఫస్టాఫ్ తో దర్శకుడు పాస్ మార్కులు వేయించుకున్నాడు. 

ఇక రెండో భాగంలో హీరో గురించిన నిజాలు బయటికి రావడం… అతను ముందు నుంచి చేస్తున్న పనులకు సమాధానాలతో ఓ అరగంట కాలక్షేపం అవుతుంది. ఈ లోపల విలన్ కు హీరోకు సంబంధించిన నిజాలు తెలియడం… రివెంజ్ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు రెగ్యులర్ గానే అనిపించినప్పుటికీ… క్లైమాక్స్ పార్ట్ సినిమాకు మెయిన్ పార్ట్. ఎందుకంటే హీరో తన మొట్టోను క్లైమాక్స్ లో చూపిస్తాడు. క్లైమాక్స్ పార్ట్ కోర్డులోనే ఉంటుంది. అక్కడ హీరో చెప్పే డైలాగ్స్, విజిల్స్ వేయిస్తాయి. హీరో చెప్పే ఎమోషనల్ స్పీచ్ ఆలోచింపచేస్తాయి. రాజకీయ నాయకులే కాదు.. సామన్యుడు సైతం ఎంత కరప్ట్ అయ్యాడో డైలాగ్స్ రూపంలో చెప్పాడు. సినిమాలో మొదటి నుంచి కూడా డైలాగ్స్ బాగానే పేలాయి. కామెడీ పంచ్ డైలాగ్స్ తో పాటు, క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ వరకు బాగా రాసుకున్నారు. 

గోపీచంద్ కు ఈ తరహా పాత్రలు కొత్త కాకపోయినప్పటికీ… తనలోని ఎమోషనల్ హీరోయిజాన్ని మరోసారి చూపించాడు. ఫైట్స్ బాగా చేశాడు. కమెడియన్స్ తో మంచి టైమింగ్ మెయింటైన్ చేశాడు. మెహ్రీన్ కు మరో కమర్షియల్ సినిమా పంతం. సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ల కాంట్రిబ్యూషన్ చాలానే కనిపిస్తుంది. గోపీసుందర్ పాటల్లో ఓకే అనిపించాడు. ఆర్ ఆర్ ఇంకా బాగా చేయాల్సింది. దర్శకుడు చక్రవర్తి పంతంతో పంతం నెగ్గించుకున్నాడో లేదో తెలీదు కానీ పాస్ మార్కులు మాత్రం వేయించుకున్నాడు. తొలి సినిమా కాబట్టి అక్కడక్కడ తడబడ్డా… ఓవరాల్ గా.. కమర్షియల్ టింజ్ ఉన్న డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు. 

ఓవరాల్ గా కమర్షియల్ ఫార్మాట్ సినిమాల్ని ఇష్టపడేవారికి, పంతం బెస్ట్ ఛాయిస్. మంచి డైలాగ్స్, మంచి సీన్స్, గోపిచంద్ పెర్ పార్మెన్స్, సినిమాటోగ్రఫీ, పృథ్వీ కామెడీ పంతం సినిమాకు ప్లస్ పాయింట్స్. సరదాగా టైంపాస్ చేయదగ్గ చిత్రం పంతం. గో అండ్ వాచ్. 

PB Rating : 3.25/5