Virat Konduru Parichayam Movie Review
విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా నటించిన చిత్రం ‘పరిచయం’. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రియాజ్ నిర్మించారు. శేఖర్ చంద్ర స్వరాలందించారు. ఇప్పటికే ఈ చిత్ర పాటలకు టీజర్ ట్రైలర్స్ కు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా యూత్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రేమలోని భావోద్వేగాలతో కూడుకున్న సినిమా కావడం ప్లస్ పాయింట్. మరి దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా ప్రేమలోని ఏ కోణాన్ని మనకు పరిచయం చేస్తున్నాడో చూద్దాం.
కథ విషయానికి వస్తే…
ఓ యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రమిది. ప్రేమ అంటే ప్రాణం. మన ప్రాణానికి ఏమైనా అవుతుందంటే మనం ఏ రిస్క్ కూడా చేయలేము. ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఎవరికైనా ఏదైనా చేయగలిగితే అదే ప్రేమ మాత్రమే అని చెప్పిన సినిమా. ఒక తల్లి ప్రాణం పోయినా పర్లేదు అనుకుంటూ బిడ్డకు జన్మనిస్తుంది. అదే.. ప్రేమంటే. అలా.. ప్రాణానికి మించి ప్రేమించే ప్రేమికుల కథనే ‘పరిచయం’ చిత్రంలో చూపించారు. రెండు మనసుల మధ్య ప్రేమ పుట్టాలన్నా, రిలేషన్ ఏర్పడ్డాలన్నా పరిచయం ఉండాలి. ఎవరి పరిచయం ఎవరి జీవితాన్ని మలుపు తిప్పింది అనేదే ఈ చిత్ర కథాంశం. ఇదొక ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. ప్రతీ సన్నివేశం అలరిస్తుంది. యువతరాన్నే కాకుండా అన్ని వర్గాలను అలరించే ప్రేమకథ ఇది.
ఇక నటీనటుల విషయానికి వస్తే… హీరో విరాట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విరాట్ కి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా సినిమాలు చేసిన నటుడిగా పెర్ ఫార్మెన్స్ చూపించాడు. ఇందులో గెడ్డంతో, గెడ్డం లేకుండా రెడు షేడ్స్ లోనూ అద్భుతంగా రాణించాడు. కథను తన భుజాల మీదేసుకున్నాడు. డ్యాన్సులు సైతం ఇరగదీశాడు. కాలేజ్ లో లవ్ చేసే సీన్స్, ప్రపోజ్ చేసే సీన్స్ లో యూత్ ఫుల్ గా ఉన్నాడు. డైలాగ్ డెలివరీ కూడా పెర్ ఫెక్ట్ గా ఉంది. పరిచయం ప్రేమ కథా చిత్రం. ఇందులో ప్రేమికుడిగా భావోద్వేగమైన సన్నివేశాల్లో విరాట్ అద్భుతంగా చేశాడు. ఎమోషనల్ సీన్స్ లో హృద్యంగా కనిపించాడు. హీరోయిన్ సిమ్రత్ తో మంచి కెమెస్ట్రీ మెయింటైన్ చేశాడు. ఇద్దరి పెయిర్ చాలా బాగుంది. నిజమైన ప్రేమికులిగా కనిపించారు. ఈ సినిమాతో విరాట్ హీరోగా నిలదొక్కుకోవడం ఖాయం. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ చిత్రాలకు విరాట్ సరిగ్గా సరిపోతాడు. సిమ్రత్ కు కూడా చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది. క్యూట్ గా ఉంది. మంచి పెర్ పార్మెన్స్ తో ఆకట్టుకుంది. పృథ్వీ చాలా రోజుల తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇది. ఆయన కూడా మంచి పాత్ర చేశారు. రాజీవ్ కనకాల ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.
ఈ సినిమాకు మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది. శేఖర్ చంద్ర అందించిన పాటలు బాగా వచ్చాయి. పాటలన్నింటికి సాహిత్యం బాగా కుదిరింది. సాహిత్యం మరోస్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొత్త ఫీల్‌ని ఇస్తుంది. ఛాయాగ్రాహకుడు నరేష్ రానాకు మంచి పేరొస్తుంది. కులుమనాలి, వైజాగ్, అరకు వంటి అందమైన ప్రదేశాల్లో తీసిన సన్నివేశాలు కంటికింపుగా ఉంటాయి.
ఫైనల్ గా …. మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది.అంతర్లీనంగా మంచి సందేశం ఉన్న ప్రేమకథా చిత్రమిది.దర్శకుడు లక్ష్మీ కాంత్ చెన్నా ప్రేమలోని విభిన్నమైన కోణాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశాడు.
PB Rating : 3.25/5