పవన్‌కళ్యాణ్ నెక్ట్స్ త్రీ ప్రాజెక్ట్స్ డీటైల్స్

జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నెక్ట్స్ త్రీ ప్రాజెక్ట్ డీటైల్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద ఆసక్తి రేపుతున్నాయి. పవన్ నటించిన గోపాలా గోపాలా ఇటీవలే విడుదలైంది. ఇక పవన్ నెక్ట్స్ మూవీ గబ్బర్‌సింగ్-2 త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా వేసవి కానుకగా మేలో విడుదల చేయనున్నారు. గోపాలా గోపాలా ప్రమోషన్ సందర్భంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పవన్ తాను నెక్ట్స్ మరో మూడు సినిమాలకు కమిట్ అయినట్టు చెప్పారు. అయితే ఆ ప్రాజెక్ట్ డీటైల్స్ చెప్పలేదు. వీటిలో గబ్బర్‌సింగ్-2 తొలి ప్రాజెక్టుగా రానుంది. ఈ సినిమాకు పవర్ దర్శకుడు కేఎస్.రవీంద్ర(బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. 

గబ్బర్‌సింగ్-2 తర్వాత పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలో నటిస్తారని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో సినిమా రూపొందిస్తున్న త్రివిక్రమ్ అది పూర్తయిన వెంటనే పవన్ కోసం మరోసారి అత్తారింటికి దారేది లాంటి ఫ్యామిలీ స్టోరీని రెఢీ చేయనున్నారు. ఇక పవన్ మూడో ప్రాజెక్టుగా ఏ సినిమా వస్తుందన్నది కాస్త సస్పెన్స్‌గా ఉంది. దీనిపై ఆయనే స్వయంగా స్పందిస్తే కాని సస్పెన్స్‌కు తెరపడదు.