జెపికి పవన్ ఫుల్ సపోర్ట్

పవన్ కళ్యాణ్ లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ కు పూర్తి మద్ధతు ప్రకటించారు. జెపి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

జెపికి మద్ధతుగా లోక్ సభ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేయనున్నారు. అయితే ఆయన లోక్ సత్తా పార్టీకి కాకుండా వ్యక్తిగతంగా జెపికి మద్ధతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. 

ఇటీవలే ఆయన జెపికి ఫోన్ చేసి తన మద్దతు తెలిపారు. అయితే జెపిపై తెలుగుదేశం అభ్యర్థిని నిలబెట్టడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.