జ‌ల్లిక‌ట్టు కావాలంటున్న ప‌వ‌ర్ స్టార్..

జ‌ల్లిక‌ట్టు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ర‌చ్చ చేస్తోన్న అంశం. నిజానికి ఇన్నాళ్ళూ జ‌ల్లిక‌ట్టు అంటే త‌మిళ‌నాడుకే ప‌రిమితం. చాలా మందికి ఇలాంటి ఓ ఆట ఉంద‌నే విష‌యం తెలియ‌దు. అది స‌జావుగా సాగిన‌పుడు జ‌ల్లిక‌ట్టు గురించి ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఎప్పుడైతే జంతు ప్రేమికులు జ‌ల్లిక‌ట్టును ఆపాల‌ని గోల చేసారో.. దెబ్బ‌కు దేశ‌మంతా తెలిసిపోయింది. త‌మిళ‌నాట అయితే ఇప్పుడు ఈ ఆట‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా క‌నిపిస్తున్నారు. త‌మ అస్తిత్వంపై దెబ్బ కొట్టొద్దంటూ త‌మిళ ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నారు. విధ్యార్థుల నుంచి హీరోల వ‌ర‌కు అంతా త‌మ త‌మ ప‌నులు మానుకుని మ‌రీ జ‌ల్లికట్టు కావాలంటూ త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు.

కేంద్రం కూడా ఈ జ‌ల్లిక‌ట్టు ఉద్యమంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సి వ‌చ్చిందంటే విష‌యం ఎంత‌దూరం వెళ్లిందో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టుపై త‌మ అభిప్రాయాన్ని దేశంలో ఉన్న ప్ర‌ముఖులంతా తెలుపుతూనే ఉన్నారు. మొన్న‌టికి మొన్న త్రిష జ‌ల్లిక‌ట్టు వ‌ద్దంటూ ట్వీట్ చేసిన పాపానికి ఆమె ఫోటోకు దండేసి దండం పెట్టేసారు త‌మిళ ప్ర‌జలు. దాంతో దెబ్బ‌కు ట్విట్ట‌ర్ అకౌంట్ క్లోజ్ చేసి.. ఈ రోజు జ‌నాల మ‌ధ్యకు వ‌చ్చి మ‌ద్ద‌తు తెలుపుతుంది త్రిష‌. ఇక అజిత్, విజ‌య్, ర‌జినీ, క‌మ‌ల్ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా జ‌ల్లిక‌ట్టు కావాలంటున్నారు.

ఈ లిస్ట్ లోకి ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా తోడ‌య్యారు. ఆయ‌న కూడా జ‌ల్లిక‌ట్టుపై త‌మ మ‌న‌సులో మాట ట్విట్ట‌ర్ లో రాసుకొచ్చాడు. జ‌ల్లిక‌ట్టు అనేది త‌మిళుల ఆన‌వాయితీ అని.. దాన్ని ఆపేయ‌డం అంటే త‌మిళ సంస్కృతిపై దాడి చేయ‌డ‌మే అని తెలిపాడు ప‌వ‌ర్ స్టార్. దీన్నిబ‌ట్టే ప్ర‌భుత్వం మ‌న ద‌క్షిణాది ఆచారాల‌పై ఎలాంటి దృష్టితో ఉందో అని తెలుస్తోంద‌ని ప‌వ‌న్ ట్వీట్ చేసాడు. తాను కూడా జంతు ప్రేమికుడినే అని.. త‌న ద‌గ్గ‌ర కూడా 16 ఆవులు, కొన్ని గేదెలు ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ లో రాసుకొచ్చాడు ప‌వ‌ర్ స్టార్. జ‌ల్లిక‌ట్టు అనేది త‌మిళుల అస్తిత్వం అని.. దానిపై దెబ్బ కొడితే త‌గిన ఫ‌లితం ఇస్తార‌ని హెచ్చ‌రించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈయ‌న‌ ట్వీట్ పై త‌మిళ ప్ర‌జ‌లు కూడా ఆనందంగా ఉన్నారు. ప‌నిలో ప‌నిగా కోడిపందేల‌పై కూడా ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో స్పందించాడు. సంప్ర‌దాయాల‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని గుర్తు చేసాడు ప‌వ‌న్. 

జ‌ల్లిక‌ట్టు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ర‌చ్చ చేస్తోన్న అంశం. నిజానికి ఇన్నాళ్ళూ జ‌ల్లిక‌ట్టు అంటే త‌మిళ‌నాడుకే ప‌రిమితం. చాలా మందికి ఇలాంటి ఓ ఆట ఉంద‌నే విష‌యం తెలియ‌దు. అది స‌జావుగా సాగిన‌పుడు జ‌ల్లిక‌ట్టు గురించి ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ఎప్పుడైతే జంతు ప్రేమికులు జ‌ల్లిక‌ట్టును ఆపాల‌ని గోల చేసారో.. దెబ్బ‌కు దేశ‌మంతా తెలిసిపోయింది. త‌మిళ‌నాట అయితే ఇప్పుడు ఈ ఆట‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునేలా క‌నిపిస్తున్నారు. త‌మ అస్తిత్వంపై దెబ్బ కొట్టొద్దంటూ త‌మిళ ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి ర‌చ్చ చేస్తున్నారు. విధ్యార్థుల నుంచి హీరోల వ‌ర‌కు అంతా త‌మ త‌మ ప‌నులు మానుకుని మ‌రీ జ‌ల్లికట్టు కావాలంటూ త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు. కేంద్రం కూడా ఈ జ‌ల్లిక‌ట్టు ఉద్యమంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టాల్సి వ‌చ్చిందంటే విష‌యం ఎంత‌దూరం వెళ్లిందో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టుపై త‌మ అభిప్రాయాన్ని దేశంలో ఉన్న ప్ర‌ముఖులంతా తెలుపుతూనే ఉన్నారు. మొన్న‌టికి మొన్న త్రిష జ‌ల్లిక‌ట్టు వ‌ద్దంటూ ట్వీట్ చేసిన పాపానికి ఆమె ఫోటోకు దండేసి దండం పెట్టేసారు త‌మిళ ప్ర‌జలు. దాంతో దెబ్బ‌కు ట్విట్ట‌ర్ అకౌంట్ క్లోజ్ చేసి.. ఈ రోజు జ‌నాల మ‌ధ్యకు వ‌చ్చి మ‌ద్ద‌తు తెలుపుతుంది త్రిష‌. ఇక అజిత్, విజ‌య్, ర‌జినీ, క‌మ‌ల్ లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా జ‌ల్లిక‌ట్టు కావాలంటున్నారు. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ కూడా తోడ‌య్యారు. ఆయ‌న కూడా జ‌ల్లిక‌ట్టుపై త‌మ మ‌న‌సులో మాట ట్విట్ట‌ర్ లో రాసుకొచ్చాడు. జ‌ల్లిక‌ట్టు అనేది త‌మిళుల ఆన‌వాయితీ అని.. దాన్ని ఆపేయ‌డం అంటే త‌మిళ సంస్కృతిపై దాడి చేయ‌డ‌మే అని తెలిపాడు ప‌వ‌ర్ స్టార్. దీన్నిబ‌ట్టే ప్ర‌భుత్వం మ‌న ద‌క్షిణాది ఆచారాల‌పై ఎలాంటి దృష్టితో ఉందో అని తెలుస్తోంద‌ని ప‌వ‌న్ ట్వీట్ చేసాడు. తాను కూడా జంతు ప్రేమికుడినే అని.. త‌న ద‌గ్గ‌ర కూడా 16 ఆవులు, కొన్ని గేదెలు ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ లో రాసుకొచ్చాడు ప‌వ‌ర్ స్టార్. జ‌ల్లిక‌ట్టు అనేది త‌మిళుల అస్తిత్వం అని.. దానిపై దెబ్బ కొడితే త‌గిన ఫ‌లితం ఇస్తార‌ని హెచ్చ‌రించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఈయ‌న‌ ట్వీట్ పై త‌మిళ ప్ర‌జ‌లు కూడా ఆనందంగా ఉన్నారు. ప‌నిలో ప‌నిగా కోడిపందేల‌పై కూడా ప‌వ‌న్ ట్విట్ట‌ర్ లో స్పందించాడు. సంప్ర‌దాయాల‌ను కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని గుర్తు చేసాడు ప‌వ‌న్.