ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్యాకేజీ క‌ళ్యాణ్..తెరాస ఎంపీ సెటైర్లు

జనసేనాని పవన్ కళ్యాణ్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు పెద్ద‌ప‌ల్లి ఎంపీ బాల్క సుమ‌న్. ప‌వ‌న్ క‌ళ్యాణా లేకా ప్యాకేజీ క‌ళ్యాణా అంటూ త‌న‌దైన శైలిలో సెటైర్‌ను వేశారు. ప‌వ‌న్.. ప్రశ్నించడం మాని, భజన చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. అనేకానేక విషయాల్లో ప‌వ‌న్‌కు స్పష్టత లేదని, ఓటుకు నోటు కేసును వదిలి ఫోన్ ట్యాపింగ్ పైన మాట్లాడటం విడ్డూరమన్నారు. ఎంత చేసినా, ఎన్ని ఎత్తుగ‌డ‌లు వేసినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని, కుట్రలకు కేరాఫ్ అడ్రస్‌గా ఆ పార్టీ మారిందని పెద‌వి విరిచారు. ప్ర‌తిప‌క్షం నిర్మాణాత్మ‌క స‌ల‌హాలు ఇస్తే త‌ప్ప‌క పాటిస్తామ‌ని ఆయ‌న చెప్పాడు.