టీడీపీతో తాడోపేడో…ఆగ‌ని ప‌వ‌న్ ట్వీట్ట‌ర్ వార్‌

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌రోసారి ట్వీట్ట‌ర్ సాక్షిగా టీడీపీ ఎంపీల‌పై విరుచుకుపడ్డారు. సోమ‌వారం ప్రెస్‌మీట్‌లో ప‌వ‌న్ టీడీపీ ఎంపీల‌ను విమ‌ర్శించ‌డంతో వారంతా ప‌వ‌న్‌పై కౌంట‌ర్ ఎటాక్ చేశారు. అయితే దీనికి కొన‌సాగింపుగా బుధ‌వారం ప‌లు ట్వీట్‌ల‌ను వ‌దిలిన ప‌వ‌న్ తాజాగా గురువారం కూడా మ‌రోసారి సీమాంధ్ర ఎంపీలపై విరుచుకుప‌డ్డారు.

తాము సీమాంధ్ర కోసం ఎంతో పోరాడామ‌ని..ఏదేదో చేస్తున్నామ‌ని చెప్పుకుంటున్న వారిపై ప‌వ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. మార్చి 17, 2015న ఏపీ విభ‌జ‌న బిల్లును సీమాంధ్ర‌లో ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు కేవ‌లం ఐదుగురు ఎంపీలు మాత్ర‌మే హ‌జార‌య్యార‌ని …మిగిలిన వారంతా ఏం చేస్తున్నారంటూ ప‌వ‌న్ ట్వీట్ట‌ర్‌లో సీమాంధ్ర ఎంపీల‌ను ప్ర‌శ్నించారు.

చ‌ర్చ‌లో పాల్గొన‌ని ఎంపీలు ఏం చేశారో చెప్పాల‌ని ప‌వ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని ఏచ‌ర్చ‌లో పాల్గొన్నారో …ఏ చ‌ర్చ‌ల్లో పాల్గోలేదో వివ‌రాల‌ను కూడా పోస్ట్ చేశారు. ఇందుకు సాక్ష్యంగా పార్ల‌మెంట్ వెబ్‌సైట్ లింక్‌ను ఆయ‌న పెట్టారు.