జనసేన పవన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచార దూకుడు పెంచుతున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డి ఎ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమౌతున్నారు. ముందుగా పోలింగ్ జరిగే తెలంగాణలో ఈ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రచారంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రచారం నిర్వహిస్తారు. తెలుగుదేశం పార్టీ సిఎం అభ్యర్థి ఆర్.కృష్ణయ్యతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. తెలంగాణలోని 45 నియోజకవర్గాలను ప్రచారం కోసం ఎంపిక చేశారు. హెలికాఫ్టర్ లో పవన్ తిరుగుతారు. 

భాజాపా ప్రధాి అభ్యర్తి నరేంద్ర మోడీ ఈనెలాఖరులో ఓసారి మే మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రచారానికి రానున్నారు. ఈ సభలో పవన్ బాబుతో కలిసి ప్రచారం చేస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, రాయలసీమ జిల్లాల్లో ప్రచారం ఉంటుంది.