శ్రీజ ఆఖరి కోరిక తీరుస్తున్న పవన్‌కళ్యాణ్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ శుక్రవారం ఖమ్మం పర్యటనకు వెళుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న శ్రీజ ఆఖరి కోరిక తీర్చేందుకు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ శుక్రవారం ఖమ్మం వెళుతున్నారు. మేక్ ఏ విష్ సంస్థ చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన శ్రీజ కోరిక తీర్చనున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో హుదూద్ తుపాను బాధితులను పరామర్శిస్తున్న ఆయన తిరుగు పర్యటనలో ఖమ్మంలో శ్రీజను పరామర్శించి హైదరాబాద్‌కు వెళతారు.