ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు చేతుల  మీదుగా  ‘పింక్స్‌ ఎన్ బ్లూస్‌’ బ్యూటీ సెలూన్  అండ్‌ స్పా ప్రారంభం

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు చేతుల  మీదుగా  ‘పింక్స్‌ ఎన్ బ్లూస్‌’ బ్యూటీ సెలూన్  అండ్‌ స్పా ప్రారంభం

హై క్యాలీఫైడ్‌ ప్రొఫెషనల్స్‌ సర్వీస్‌తో అందరికీ అందుబాటులో ఉండేలా ‘పింక్స్‌ ఎన్  బ్లూస్‌’ బ్యూటీ సెలూన్  అండ్‌ స్పా’ ఏర్పాటు చేశారు వాసంతి చందు. శుక్రవారం మణికొండ హాల్‌ మార్క్‌ విల్లాస్‌ వద్ద నూతన బ్రాంచ్‌ ప్రారంభోత్సవం ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కె.నాయుడు, `పింక్స్  ఎన్ బ్లూస్ ` చైర్మన్   సీతాదేవి  చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా చోటా కె నాయుడు మాట్లాడుతూ …“పింక్స్ ఎన్ బ్లూస్ “ బ్యూటీ సెలూన్  అండ్‌ స్పా ఇప్పటికే  ప్రారంభమైన అన్ని  చోట్ల నుంచి  మంచి  గుర్తింపు తెచ్చుకున్నాయి. అదే స్థాయి లో వాటికీ ఏ మాత్రం తగ్గకుండా వాసంతి చందు మణికొండ లో ఒక బ్రాంచ్  ప్రారంభించారు. ఈ సంధర్భంగా నా శుభాకాంక్షలు “ అన్నారు.

‘పింక్స్‌ ఎన్  బ్లూస్‌’  చైర్మన్ సీతాదేవి మాట్లాడుతూ …“ఇప్పటికే మేము  ‘పింక్స్‌ ఎన్  బ్లూస్‌’ తెలంగాణ, ఆంధ్ర , కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రారంభించాం.  అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉండే ధరలతో…హై క్వాలీఫైడ్‌ ప్రొఫెషనల్స్‌తో సర్వీసెస్ అందిస్తున్నాం. అంతటా పింక్స్ ఎన్ బ్లూస్ కి మంచి పేరుంది.  వాసంతి చందు కి మణికొండ బ్రాంచ్ ఫ్రాంఛైజీ ఇచ్చాము. ఈ సందర్భంగా వాసంతి చందు అండ్ టీం కి ఆల్ ది బెస్ట్ “ అన్నారు.

‘పింక్స్‌ ఎన్  బ్లూస్‌’ మణికొండ బ్రాంచ్‌ అధినేత వాసంతి చందు మాట్లాడుతూ…‘‘ అందరికీ అందుబాటులో ఉండే ధరలతో…హై క్వాలీఫైడ్‌ ప్రొఫెషనల్స్‌తో మా ‘పింక్స్‌ ఎన్  బ్లూస్‌’ లో సర్వీస్‌ అందించనున్నాం.  ఫ్రాంఛైజీ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తోన్న  చోటా కె నాయుడుగారు,  వారి సతీమణి సీతాదేవి గారికి కృతజ్ఞతలు “అన్నారు