పాయింట్‌పై గ‌న్‌పెట్టి యువ‌తిపై రేప్‌… పోలీస్ అధికారి అరెస్టు

ఆ పోలీస్ అధికారి కామాంధుడిగా మారాడు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన గన్ ఉంది కాదా అని దానిని ఓ యువ‌తి క‌ణ‌త‌కు గురి పెట్టి ఆమెను బెదిరించి రేప్‌కు పాల్ప‌డ్డాడు. ఢిల్లీలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. పంజాబి బాఘ్ పోలీస్ స్టేషన్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ జవీర్ సింగ్ గురువారం రాత్రి రాణీ బాఘ్ ప్రాంతంలోని అతని స్నేహితుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో పూటుగా మ‌ద్యం సేవించాడు.
 
 ఆ టైంలో ఇంట్లో ఎవ్వ‌రు లేక‌పోవ‌డంతో అక్క‌డ ప‌ని చేస్తున్న ఓ యువ‌తి(23)పై అత‌డి క‌న్ను ప‌డింది. ఆమెపై బ‌లాత్కారం చేయ‌బోగా ఆమె ప్రతిఘటించడంతో జవీద్ తన గన్ తీసి యువతి పాయింట్ బ్లాంక్‌లో పెట్టి బెదిరించాడు. త‌ర్వాత ఆమెపై రాత్రంతా రేప్ చేశాడు. అయితే ఈ ఘటనంతా ఇంట్లో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది. మరుసటి రోజు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు ఏఎస్ఐ జవీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.