మూడేళ్లుగా అత్యాచారం…వీడియోలతో కానిస్టేబుల్ వేధింపులు

చ‌ట్టాన్నిర‌క్షించాల్సిన ఆ కానిస్టేబుల్ ఓ మ‌హిళ‌పై ఒక‌టి రెండు రోజులు కాదు..ఏకంగా మూడేళ్ళపాటు అత్యాచారం చేశాడు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివరాలిలా ఉన్నాయి. మ‌నీష్ అనే కానిస్టేబుల్ మూడు సంవ‌త్స‌రాలుగా త‌న‌పై అత్యాచారానికి పాల్పడుతున్నాడని 24 ఏళ్ల యువతి తిలక్ మార్గ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

మత్తుమందు కలిపిన ద్రావణం ఇచ్చి మొదటిసారి తనపై అతడి ఇంట్లోనే అత్యాచారం చేశాడని, ఆ సమయంలో వీడియో తీసి బెదిరించి త‌న‌ను లొంగ‌దీసుకున్నాడ‌ని ఆమె వాపోయింది. ప్ర‌తిసారి వీడియో ఇచ్చేస్తానంటూ ఇంటికి రప్పించుకుని మరోసారి అత్యాచారం చేశాడని తెలిపింది. మూడేళ్ళుగా ఇదేవిధంగా అనేకమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు వివరించింది.

అయితే త‌న‌పై ఆ యువ‌తి ఫిర్యాదు చేయ‌డంతో ఆ యువతితో మూడేళ్ల క్రితమే పెళ్లైనట్లుగా సర్టిఫికెట్ తెచ్చి చూపాడని, అది అసలుదో కాదో తేలాకే కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకుంటామని తిలక్ మార్గ్ పోలీసులు తెలిపారు.