పాలిటిక్స్ లోకి వ‌చ్చిన శిరీష్..

మెగా ఫ్యామిలీలో కాస్త ఆల‌స్యంగానైనా క్రేజ్ తెచ్చుకున్న హీరో అల్లుశిరీష్. ఈయ‌న ఒక్క‌డికే మూడు సినిమాలు ప‌ట్టింది ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేయ‌డానికి. ఈ ఏడాది శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తుతో సూప‌ర్ హిట్ కొట్టాడు శిరీష్. ఈ సినిమా త‌ర్వాత కెరీర్ ను జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే మ‌ళ‌యాలంలోనూ ఓ స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు. అక్క‌డ మోహ‌న్ లాల్ తో క‌లిసి న‌టిస్తున్నాడు శిరీష్. తెలుగులో ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ విఐ ఆనంద్ తో సినిమా చేస్తున్నాడు. ఇది సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నుంది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే.. తాజాగా శిరీష్ పొలిటిక‌ల్ కామెంట్స్ చేసి అంద‌ర్ని ఆశ్చ‌ర్యంలో ముంచెత్తాడు. ట్విట్ట‌ర్ లో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ గా ఉండే అల్లు హీరో.. గుజ‌రాత్, మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై త‌న‌దైన శైలిలో స్పందించాడు. అక్క‌డ బిజేపీ విజ‌యం సాధించ‌డం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేసాడు శిరీష్. న‌రేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు స్వాగ‌తించ‌డానికి ఇదే నిద‌ర్శ‌నం అన్నాడు శిరీష్. అంతేకాదు.. పెద్ద నోట్ల ఎఫెక్ట్ లో కాస్త ఇబ్బందులు ఎదురైన మాట నిజ‌మే అయినా.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భత్వాలు దీనికి అండ‌గా నిల‌వాల‌ని ఆకాంక్షించాడు. అంతేకాదు.. ఆప‌త్కాల స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని సూచించాడు. ఇంత‌కీ నువ్వెప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చావు శిరీష్ అంటూ ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు.. నేనెప్పుడో రాజ‌కీయాల్లో ఉన్నా.. ఓట‌రుగా అంటూ స‌మాధానమిచ్చాడు శిరీష్.