బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసిన “ఓసి రాకాసి…. “ పాట.

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేసిన “ఓసి రాకాసి…. “ పాట.
శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి మహిపాల్ రెడ్డి (TMR) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “పోస్టర్” ఈ సినిమా నుండి “ఓసి రాకాసి…” అనే మొదటి పాటను బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు. అనంతరం రాహుల్ మాట్లాడుతూ, ఈ పోస్టర్ సినిమాలో ఈ పాట ను నేనే స్వయంగా పాడాను, అటువంటి నేను పాడిన పాటను నేనే విడుదల చేసుకోవడం నాకు చాలా కొత్తగా, ఆనందంగా ఉంది. నాకు ఈ పాట పాడేందుకు అవకాశం ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శాండీ అద్దంకి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సాంగ్ అందరూ వినండి, చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. అలాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నా అని తెలిపారు.
హీరో విజయ్ ధరన్ మాట్లాడుతూ, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా మనందరికీ బాగా దగ్గరయిన మన రాహుల్ సిప్లిగంజ్ మా సినిమాలో ఒక పాట పాడారు, పాట అత్యద్భుతంగా వచ్చింది, ఆ పాటను స్వయంగా మా సింగర్ రాహుల్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. తను పాడిన ఈ పాట సినిమాకు మరెంత బలం చేకూరుస్తుంది. ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుంది, రేపు సినిమా చూసే ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది. శాండీ గారు సంగీతం చాలా బాగా అందించారు. మా సినిమా పాటలు మీకు బాగా నచ్చుతాయి అని ఆశిస్తున్నా అని తెలిపారు.
సంగీత దర్శకుడు శాండీ అద్దంకి మాట్లాడుతూ నా సింగర్ నా పాటను బిగ్ బాస్ ఐకాన్ గా విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని, ఈ సాంగ్ తో నాకు మంచి పేరు రావాలని, రాహుల్ తో మంచి మంచి సాంగ్స్ పాడించుకోవాలని కోరుకుంటున్నా అని తెలిపారు.
పోస్టర్ సినిమా దర్శకులు TMR మాట్లాడుతూ మా సినిమా ఫస్ట్ సాంగ్ ను సింగర్ రాహుల్ లాంచ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది, తనే ఈ పాట పాడారు. ఈ పాట మా సినిమా ఆల్బమ్ లో ఒక సూపర్ హిట్ సాంగ్ అవుతుందని మాకు నమ్మకం ఉంది, నేను ఇంత బాగా షూటింగ్ పూర్తి చేయడానికి నాకు సహకరించిన నా సినిమా టీం కూ నా ప్రత్యేక ధన్యవాధాలు అని తెలిపారు.
ఈ పాట రాసింది లక్ష్మి ప్రియాంక, పాడింది రాహుల్ సిప్లిగంజ్, సంగీతం శాండీ అద్దంకి.
శివాజీ రాజ, మధుమణి, రామరాజు, కాశి విశ్వనాధ్, స్వప్నిక, అరుణ్ బాబు జగదిశ్వరి వంటి నటినటులు నటిస్తున్న ఈ సినిమాకు మాటలు నివాస్, పి.ఆర్.ఓ కెవి కుమార్ కావూరి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, నిర్మాతలు టి మహిపాల్ రెడ్డి, టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి మరియు ఐ జి రెడ్డి, లు కలసి సంయుక్తంగా నిర్మించారు. రచన – దర్శకత్వం టి.యం.ఆర్.