జైలుకు బాహుబలి బ్రదర్… ప్రభాస్, కృష్ణంరాజు పట్టించుకోలేదా..

ప్రభాస్ సోదరుడు జైలుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభాస్ సోదరుడికి అలాంటి పరిస్థితి రావడమేంటని ఆశ్చర్యపోకండి. చెక్ బౌన్స్ కేసులో యూవీఎస్‌ఎస్‌ఆర్‌ ప్రబోధ్‌ ఇరుక్కున్నాడు. బిల్లా సినిమాకు ప్రభోద్ కూడా నిర్మాతే. ఆ చిత్ర సమయంలో సికింద్రాబాద్‌కు చెందిన గంగాగనాతే అనే మహిళ దగ్గర 43 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దానికి గాను గంగాగనాతే కు ప్రభోద్ చెక్కు ఇచ్చాడు. కానీ ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో 2013లో కోర్టును ఆశ్రయించింది బాధితురాలు. విచారించిన కోర్టు ప్రభోద్ కు సంవత్సరం జైలు శిక్షతో పాటు నష్టపరిహారం కింద బాధితురాలు గంగాగనాతేకు రెండు నెలల్లో 87 లక్షలు చెల్లించాలని రాజేంద్ర నగర్ కోర్టు తీర్పు ఇచ్చింది.

అయితే ప్రభాస్ ఫ్యామిలీ దగ్గర ఇవ్వడానికి డబ్బులు లేవంటే ఎవ్వరూ నమ్మరు. అందునా పెదనాన్న కృష్ణంరాజు ఉండనే ఉన్నారు. అలాంటి ఫ్యామిలీ కోర్టు మెట్లు… జైలు గోడల వరకు… సీన్ ఎందుకు తెచ్చుకున్నారనేదే ఇప్పుడు అభిమానులకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీలో ఇంత జరుగుతున్నా కృష్ణంరాజు, ప్రభాస్ పట్టించుకోలేదా. స్టార్ హీరో బ్రదర్ కు సంబంధించిన మ్యాటర్ కావడంతో టాలీవుడ్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా డిస్కస్ చేస్తున్నారు. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్ సోదరుడికి జైలు శిక్ష ఏంటని అభిమానులు షాక్ అవుతున్నారు.