ప్రభాస్-పూరి-కళ్యాణ్‌రామ్‌ల సినిమా

మిర్చి సినిమా తర్వాత యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మరో సినిమా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం బాహుబలి తొలి పార్ట్ షూటింగ్ పూర్తి కావడంతో సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కావడానికి మరో నాలుగైదు నెలలు టైం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి-1 నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. రెండో పార్ట్ షూటింగ్ స్టార్ట్ కావడానికి మరో నాలుగు నెలలు పట్టే అవకాశం ఉంది. ఈ గ్యాప్‌లో ప్రభాస్ మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. తక్కువ టైంలో సినిమాలు తీసే పూరి జగన్నాథ్‌తో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు టాక్. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌తో గతంలోనే బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాలు రూపొందించిన పూరి జగన్నాథ్ మరో సినిమా చేసేందుకు అంగీకరించాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఎన్టీఆర్‌తో టెంపర్‌ను పూర్తి చేసిన పూరి వెంటనే ప్రభాస్ కోసం ఓ స్క్రిఫ్ట్ రెఢీ చేస్తాడని టాక్. ఈ ప్రాజెక్టు ఓకే అయితే త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.