నిమ్స్‌లో రెబల్‌స్టార్… ఆందోళనలో ఫ్యాన్స్

టాలీవుడ్‌ను ఇటీవల వరుసగా విషాదాలు వెంటాడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని విధంగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రామానాయుడు మృతి… చంద్రమోహన్‌కు గుండెపోటు లాంటి సంఘటనలతో ఆందోళనలో ఉన్న టాలీవుడ్‌కు మరో షాక్ న్యూస్ తగిలింది. రెబల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో నిమ్స్‌లో చేరారు. ఈ వార్త తెలియడంతో టాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు లోనయ్యింది. 

నిమ్స్ కార్డియాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేషగిరిరావు ఆధ్వర్యంలో డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు కృష్ణంరాజుకు వైద్యం అందిస్తున్నారు. కృష్ణంరాజు నిమ్స్‌లో చేరారన్న వార్త తెలియడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే దీనిపై నిమ్స్ వైద్యులు స్పందిస్తూ కృష్ణంరాజు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.