హిందీ పరుగు కు ప్రకాష్ రాజ్ డబ్బింగ్

జాకీ ష్రాఫ్ తనయుడు ‘టైగర్ ష్రాఫ్’ హీరోగా పరిచయం అవుతున్న ‘HEROPANTI’ (అల్లు అర్జున్ ‘పరుగు’ రీమేక్) చిత్రానికి సంభందించి తనపాత్రకు ‘ప్రకాష్ రాజ్’ గత రెండు రోజులుగా హైదరాబాద్ లోని ‘శబ్దాలయ’ ధియేటర్ లో డబ్బింగ్ చెప్పారు. ‘పరుగు’ లో తాను పోషించిన పాత్రనే ఈ హిందీ లోనూ అభినయించారు.

ఈ చిత్రంలో ‘కృతి సనన్’ (మహేష్ బాబు ‘వన్’ నాయిక) నాయికగా నటిస్తున్నారు. (హిందీ లో ఆమెకిది తొలి చిత్రం) మే నెలలో విడుదలకాబోతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తుండగా సబ్బిర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.