“ప్రశ్నిస్తా”తో హీరోగా వస్తోన్న మనీష్ బాబు సక్సెస్ కావాలి…లోగో లాంచ్ లో అతిధుల ఆకాంక్ష..!!

నటుడు,నిర్మాత, దర్శకుడు పి.సత్యా రెడ్డి తన తనయుడు మనీష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ .. రాజా వన్నెం రెడ్డి దర్శకత్వంలో జనం ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం ప్రశ్నిస్తా. ఈ చిత్రం లోగో లాంచ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సి.కళ్యాణ్, టి.ప్రసన్నకుమార్, దాసరి కిరణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అభిషేక్ అగర్వాల్, హీరో మనీష్ బాబు, హీరోయిన్స్ అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా, దర్శకుడు రాజా వన్నెం రెడ్డి, మాటల రచయిత రాజేంద్ర కుమార్, సంగీత దర్శకుడు వెంగి, సతీష్ రెడ్డి, శేషు బాబు, శివ కుమార్ పాల్గొనగా నిర్మాత సత్యారెడ్డి బొకేలతో అతిధుల్ని స్వాగతించారు.. అనంతరం…
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ…నా ఆప్తమిత్రుడు సత్యారెడ్డి నిర్మాతగా మంచి సినిమాలు తీసాడు. వారి అబ్బాయి మనీష్ ని హీరోగా పరిచయం చేస్తూ ప్రశ్నిస్తా చిత్రాన్ని నిర్మించారు. అందరూ ‘ప్రశ్నించే’ విధంగా ఈ చిత్రం గొప్ప హిట్ కావాలి. మనీష్ హీరోగా సక్సెస్ అయి మంచి పేరు తెచ్చుకుంటాడాని ఆశిస్తున్నాను.. అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ… ఓ సారి సత్యారెడ్డి పుట్టినరోజు ఫంక్షన్ లో మనీష్ ని చూసాను. ఆరడగుల వున్నాడు..హీరోకి కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి..అతన్ని హీరోగా చెయ్యి అని సత్యాకి చెప్పాను. నేను చెప్పిన మాటని మెటీరియలేజ్ చేస్తూ ఇవాళ మనీష్ ని హీరోగా ప్రశ్నిస్తా సినిమా చేసాడు. కాంబినేషన్ కన్నా కంటెంట్ ని నమ్ముకొని సినిమా చేస్తే మరిన్ని మంచి చిత్రాలు చేయొచ్చు. టైటిల్ చాలా బాగుంది. మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేసారు. ఈ సినిమా సూపర్ హిట్ అయి మనీష్ మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలి… అన్నారు.
నిర్మాత పి.సత్యారెడ్డి మాట్లాడుతూ… ఆరోజు కళ్యాణ్ గారు అన్న మాట నిజం అయ్యింది. రాజా వన్నెం రెడ్డి మా అబ్బాయిని హీరోగా చేస్తానని క్షేమంగా వెళ్లి లాబంగా రండి టైమ్ లో మాట ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాట మీద నిలబడి మంచి కథతో అద్భుతమైన సినిమా చేశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలు, ప్రభుత్వ పాలసీలు మీద ఒక స్టూడెంట్ లీడర్ ఏ విధంగా పోరాడారు..ఎలా ప్రశ్నించాడు అనేది కథ. మా అబ్బాయిని, ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను.. అన్నారు.
దర్శకుడు రాజావన్నేంరెడ్డి మాట్లాడుతూ… ఇండస్ట్రీలో గ్రాస్పింగ్ పవర్ ఉన్న హీరోల్లో కృష్ణ గారి పేరు చెప్తారు. అలా ఈ చిత్రం లో పెద్ద పెద్ద డైలాగ్స్ మనీష్ చెప్పాడు. ఒక కసితో ఎక్స్ ట్రార్డినరీగా నటించాడు మనీష్. అసలు ఎక్స్ పెక్ట్ చేయలేదు. ప్రెజెంట్ ట్రెండ్ కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది. సత్యారెడ్డి క్వాలిటీకి వెనకాడకుండా ఈ సినిమాని నిర్మించారు. డెఫినెట్ గా మనీష్ మంచి హీరో అవుతాడు.. అన్నారు.
హీరో మనీష్ బాబు మాట్లాడుతూ.. సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా థాంక్స్.. అన్నారు. అక్షిత, హసీనా మస్తాన్ మీర్జా అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.