ప్రేమజంట మూవీ రివ్యూ

ప్రేమజంట మూవీ రివ్యూ

సన్ వుడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రామ్ ప్రణీత్, సుమయ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `ప్రేమ‌జంట‌`. స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ద‌గ్గుబాటి వ‌రుణ్ ఈ చిత్రాన్ని జూన్ 28న విడుద‌ల చేస్తున్నారు. మహేష్ మొగుళ్ళూరి నిర్మాత. నిఖిలేష్ తొగరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

కథేంటంటే…. చందు (రాం ప్రణీత్) నందు (సమయ) ఇద్దరు ప్రేమించుకుంటారు. మైనర్లు కావడం తో మేజర్ అయ్యేవరకు పెళ్లిచేసుకోకూడదని అనుకుంటారు. కానీ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడంతో హైదరాబాద్ పరిపోతారు. ఆ తర్వాత అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఈ టైం లో కొంతమంది బలవంతంగా పెళ్లి చేస్తారు మైనర్లకు పెళ్లి చేశారని కోర్టు వరకు వెళ్తుంది. ఇంతకు కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది. వీరికి పెళ్లి చేసింది ఎవరు. ఇలాంటివి తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

హీరోయిన్ రాఖీ కట్టే సన్నివేషం బాగుంది. ఫ్రెండ్స్ కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఆటో దగ్గర హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్ సినిమాకి హై లైట్ గా నిలిచింది
ప్రేమ గురించి చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. హీరోయిన్ ఫోన్ నెంబర్ అడిగి సీన్ తీసుకునే సీన్ బాగా చేశారు. ఆ టైం లో చైల్డ్ ఆర్టిస్ట్ బాగా నటించింది. హీరో హీరోయిన్ కి ఫోన్ లో ఈ లవ్ యు చెప్పే సీన్ బాగుంది. కాలేజ్ లో లెక్చరర్ స్టూడెంట్స్ గురించి బాగా చెప్పాడు. హీరో హీరోయిన్ ని ప్రపోజ్ చేసిన తర్వాత వచ్చే మెలోడీ సాంగ్ కంపోజింగ్ బాగుంది. హీరో హీరోయిన్ పారిపోవడం కూడా తెలివిగా ప్లాన్ చేశాడు దర్శకుడు. ఇంఎర్వెల్ ట్విస్ట్ బాగుంది.

షఫీ సులేమాన్ క్యారెక్టర్ చేశాడు. షఫీ ఎంటర్ అయిన తర్వాత సినిమా టెంపో మారిపోయింది. హీరోయిన్ మిస్ అవ్వడంతో సినిమా ఇంట్రెస్టింగ్ గా మారింది. బ్రోతల్ హౌస్ నడిపే పాత్రలో  స్వాతి నాయుడు నటించింది.  హీరోయిన్ కోసం హీరో వెతికే క్రమంలో వచ్చే పాథోస్ సాంగ్ ఎమోషనల్ గా బాగుంది. హీరో హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో కలిసే సీన్ వెరీ ఎమోషనల్.

రామ్ ప్రణీత్, సుమయ  హీరో హీరోయిన్ ఇద్దరు కొత్తవారైన చాలా సహజంగా నటించారు. ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది. క్లైమాక్స్ లో వచ్చే కోర్టు సీన్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. లాయర్లు గా ఉతేజ్ రాజా రవీంద్ర కోసం రాసిన డైలాగ్స్ ఆలోచనాత్మకంగా ఉన్నాయి. మైనర్ మ్యారేజ్ మీద చేసిన చర్చ బాగుంది. చట్టం ప్రేమ మీద జరిగే ఈ సీన్ పై దర్శకుడు అఖిలేష్ ఆలోచన బాగుంది. చాలా మంది ప్రేమికుల జీవితాల్లో జరిగే సంఘటనల్ని దర్శకుడు బాగా తెరకెక్కించాడు. పంప్లేట్స్ పంచె సీన్ కూడా బాగుంది. హీరోయిన్ తండ్రి చివర్లో ఇచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. పిక్చరైజేషన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వేల్యూస్ కూడా చాలా బావున్నాయి. మ్యూజిక్ నిఖిలేష్ చాలా బాగా అందించాడు. సెకండ్ హాఫ్ లో ప్రేమిస్తే పాపం అనే సాంగ్ హార్ట్ టచింగ్ గా ఉంది. సురేష్ శెట్టిపల్లి కెమెరా వర్క్ బాగుంది.  ప్రొడ్యూసర్: మహేష్ మొగులూరి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఓవరాల్ గా…
ప్రేమ కథా చిత్రాల్లో చాలా సహజంగా తెరకెక్కించిన సినిమా. ముఖ్యంగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. యూత్ ని ఊర్రూతలూగించే సినిమా గో అండ్ వాచ్.

PB Rating : 3/5