సిరి క్రియేషన్స్ వర్క్స్ ప్రేమదేశం ప్రారంభం

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న "ప్రేమదేశం" చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడింది. పూరి జగన్నాధ్ అబ్బాయి ఆకాష్ పూరి చిత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది.

అజయ్, మాయ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్ర తొలి సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టడం జరిగింది. ఆనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించగా జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీకాంత్ శిద్ధం ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు శేఖర్ గంగాణమోని సినిమాటోగ్రఫి అందుస్తున్నారు. నీలిమ తిరుమల్ శెట్టి సహకారంతో శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 

నటీనటులు:

అజయ్ కతుర్వ, మాయ, శివ కుమార్ రామచంద్రవరపు, వైశాకి, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్.

 

సాంకేతిక నిపుణులు:

డైరెక్టర్: శ్రీకాంత్ శిద్దం

నిర్మాత:శిరీష, నీలిమ తిరుమల్ శెట్టి

బ్యానర్: సిరి క్రియేటివ్ వర్క్స్

మ్యూజిక్: మణిశర్మ

సినిమాటోగ్రఫి: శేఖర్ గంగణమోని

ఎడిటర్: కిరణ్ తుంపెర

పబ్లిసిటీ డిజైన్: అనిల్- భాను

పి. ఆర్.ఓ: వంశీ – శేఖర్