జులాయి భక్తుడ్ని చంపిన తాగుబోతు పూజారి… ఆల‌యంలో పూడ్చివేత‌

ఓ జులాయి భ‌క్తుడిని ఆల‌యంలో ప‌నిచేసే తాగుబోతు పూజారి కొట్టి చంపిన సంఘ‌ట‌న హైద‌రాబాద్ గండిపేటలో జ‌రిగింది. గండిపేట‌కు చెందిన మహేశ్ కుమార్ వ్యాస్ జులాయిగా మార‌డంతో అత‌డి కుటుంబం ఇంటినుంచి గెంటివేసింది. మ‌హేష్ త‌న మేన‌మామ ఇంటికి చేరాడు. ఆయ‌న కుమారుడు పవన్‌కుమార్‌ జోషి స్థానిక‌ ఆలయంలో పూజారి. అయితే వీరిద్ద‌రు క‌ల‌సి మ‌ద్యం సేవించేవారు.

ప‌వ‌న్‌కు ప్ర‌తి రోజు రాత్రి మ‌ద్యం సేవించే అల‌వాటు ఉంది. ఇతనికి వ్యాస్‌కు మంచి దోస్తీ కుదిరింది.వీరిద్ద‌రి స్నేహం కొంతకాలం బాగానే సాగినా మద్యం కోసం వ్యాస్‌ జోషిని వేధించేవాడు. అయితే ఓ రోజు మ‌హేష్ మ‌ద్యం కోసం ప‌వ‌న్‌ను వేధించ‌డంతో మ‌త్తులో ఉన్న అత‌డు మ‌హేష్ త‌ల‌పై సుత్తితో కొట్ట‌డంతో మ‌హేష్ జోష్ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయాడు.

ప‌వ‌న్ మ‌హేష్ మృత‌దేహాన్ని ఎవ్వ‌రికి తెలియ‌కుండా ఆలయం పక్కనే ఉన్న సంప్‌ హౌస్‌లో పూడ్చి పెట్టాడు. అయితే నెల‌న్న‌ర రోజుల త‌ర్వాత పోలీసుల విచార‌ణ‌లో తానేమ‌ద్యం మ‌త్తులో మ‌హేష్‌ను చంపేసిన‌ట్టు ప‌వ‌న్ ఒప్పుకున్నాడు. అత‌నిచ్చిన వివ‌రాల ప్ర‌కారం అక్క‌డ త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌గా సంప్‌లో మ‌హేష్ జోషి అస్తిపంజ‌రం బ‌య‌ట‌ప‌డింది. పోలీసులు ప‌వ‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు.