పూరి జగన్నాథ్ నిజంగానే ఫామ్ లోకి వచ్చాడా..

పూరి జగన్నాథ్ ఈజ్ బ్యాక్.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మార్మోగుతున్న మాట ఇదే. ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసి పూరీ ఇస్ బ్యాక్ అంటున్నారు. కొన్నిచోట్ల యావరేజ్ టాక్ వచ్చినా.. ఊర మాస్ సినిమా అని విమర్శలు వచ్చినా ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఇస్మార్ట్ శంకర్ సంచలనం సృష్టిస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్నాడు రామ్. పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లేతో పాటు అదిరిపోయే డైలాగులు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దాంతో ఓపెనింగ్స్ విషయంలో శంకర్ రామ్ కెరీర్లోనే కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. దాదాపు 9 కోట్ల షేర్ వసూలు చేసేలా కనిపిస్తుంది ఇస్మార్ట్ శంకర్. దానికి తోడు నాలుగు రోజుల వీకెండ్ ఉండటంతో ఆదివారం నాటికి డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వచ్చేలా కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో శంకర్ పంట పడటం ఖాయంగా కనిపిస్తోంది. హీరో ఆటిట్యూడ్.. హీరోయిన్ గ్లామర్ షో.. బుర్ర మార్పిడి అనే కొత్త కథ.. ఇవన్నీ ఇస్మార్ట్ శంకర్ కు ప్లస్ అయ్యాయి. దానికి తోడు సింగిల్ స్క్రీన్స్ లో పూరి జగన్నాథ్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఎలా చూసుకున్నా కూడా ఇస్మార్ట్ శంకర్ సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నింటికీ మించి ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క మాస్ సినిమా కూడా విడుదల కాలేదు. సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ వినయ విధేయ రామ కూడా అంచనాలు అందుకోలేదు. దాంతో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర శంకర్ పండగ చేసుకోవడానికి సిద్ధం అయ్యాడు. మరి చూడాలి ఈ స్మార్ట్ శంకర్ ఎంత వసూలు చేస్తాడో… దాన్ని బట్టే పూరీ పూర్తిగా ఫాంలోకి వచ్చాడా లేదా అనేది తేలేది.