ఫిబ్రవరి 8న క్విక్ హీల్ ఐపిఒ ఆరంభం

• 2,500 మిలియన్లతో తాజా ఇష్యూ
• ప్రమోటర్లు మరియు పిఇ పెట్టుబడిదారుల చేత 6,269,558 దాకా విక్రయించేందుకు ఆఫర్
• కనీస బిడ్ లాట్ 45 ఈక్విటీ షేర్లు మరియు ఆ పై 45 ఈక్విటీ షేర్ల గుణాంకాలు
• ఇష్యూ ఆరంభ తేదీ – 8 ఫిబ్రవరి, 2016 మరియు ముగింపు తేదీ – 10 ఫిబ్రవరి, 2016.

ఫిబ్రవరి 08, 2016 న రూ. 10 ల ప్రకటిత మూల్యం కలిగిన ప్రతి ఈక్విటీ షేర్‌కు రూ. 311 నుండి రూ. 321 దాకా ఒక ప్రైజ్ బ్యాండ్‌తో క్విక్ హీల్ టెక్నాలజీస్ లిమిటెడ్, వారి ఐపిఒతో పెట్టుబడి మార్కెట్లలోకి ప్రవేశించనున్నది.

ఐపిఒలో ఉండేవి, కంపెనీ ద్వారా రూ. 2500ల తాజా ఇష్యూ మరియు సెక్వోవా క్యాపిటల్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్ III మరియు సెక్వోవా క్యాపిటల్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ III కాకుండా, ప్రమోటర్లు కైలాష్ సాహెబ్రావ్ కట్కర్ మరియు సంజయ్ సాహెజ్రావ్ కట్కర్ల ద్వారా 6,269,558 ఈక్విటీ షేర్ల దాకా విక్రయించేందుకు ఒక ఆఫర్.
బుక్ బిల్డింగ్ ప్రక్రియ ద్వారా ఇష్యూ చేయబడుతుంది, ఇందులో అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (QIBల)కు ఆఫర్లోని 50%, దామాషా ఆధారంగా అందించబడుతుంది, BRLMలతో సంస్థ మరియు విక్రయ వాటాదారులు నిబంధనలో ఉండి ఉంటే, విచక్షణాపూర్వక ఆధారిత యాంకర్ పెట్టుబడుదారులకు ("యాంకర్ పెట్టుబడిదారు భాగం") QIB వర్గంలో 60% వరకు కేటాయించవచ్చు, యాంకర్ పెట్టుబడిదారు ఆఫర్ ధర వద్ద లేదా దానికి మించి, దేశీయ మ్యూచువల్ ఫండ్ల నుండి చెల్లుబాటయ్యే బిడ్లు పొందబడ్డదానికి లోబడి దీనిలో మూడవ భాగం దేశీయ మ్యూచువల్ ఫండ్ల కొరకు ప్రత్యేకించబడుతుంది.

ఇంకా, సెబీ ఐసిడిఆర్ నిబంధనలకు అనుగుణంగా, ఆఫర్ ధర వద్ద లేదా దానికి మించి పొందిన చెల్లుబాటయ్యే బిడ్లకు లోబడి, సంస్థాగతేతర పెట్టుబడిదారులకు ఒక దామాషా ఆధారంగా నికర ఆఫర్లో 15%కు తగ్గకుండా కేటాయింపు కొరకు అందుబాటులో ఉంటుంది మరియు రీటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారులకు కేటాయించేందుకు నికర ఆఫర్లో 35%కు తగ్గకుండా అందుబాటులో ఉంటుంది. ఆఫర్ ధర వద్ద లేదా దానికి మించి పొందిన చెల్లుబాటయ్యే బిడ్లకు లోబడి, ఎంప్లాయీ రిజర్వేషన్ భాగం కింద బిడ్ చేసే అర్హులైన ఉద్యోగులకు దామాషా ఆధారంగా రూ.50 మిలియన్లకు సంకలన అయ్యే ఈక్విటీ షేర్లు అందుబాటులో ఉంచబడతాయి. ASBA ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ ఆఫర్లో (యాంకర్ పెట్టుబడిదారులు తప్ప) పెట్టుబడిదారులందరూ పాల్గొనగలరు.

లింక్ ఇంటిమేట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది రిజిస్ట్రార్ కాగా, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, జెఫెరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మరియు జె.పి. మోర్గన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లు.

కంపెనీ యొక్క ఇష్యూ-తదుపరి చెల్లించిన ఈక్విటీ షేర్ క్యాపిటల్ యొక్క [●]% ను ఆఫర్ కల్పిస్తుంది మరియు ఇష్యూ-తదుపరి చెల్లించిన ఈక్విటీ షేర్ క్యాపిటల్ యొక్క [●]% ను నెట్ ఆఫర్ కల్పిస్తుంది.

క్విక్ హీల్ యొక్క ఈక్విటీ షేర్లు BSE మరియు NSE మీద జాబితా చేయబడేందుకు ప్రతిపాదించబడ్డాయి.