రాధికా ఆప్టే మ‌ళ్లీ రాజేసింది..!

రాధికా ఆప్టే.. ఈ భామ పేరు వింటే చాలు ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీ వినిపిస్తూనే ఉంటుంది. అంత‌గా నోటి దురుసు ఉంది ఈ భామ‌కు. ఎప్పుడూ ఏదో ఓ కాంట్ర‌వ‌ర్సీతో వార్త‌ల్లో నిల‌వ‌డం అంటే ఈ భామ‌కు భ‌లే స‌ర‌దా. ఇప్పుడు కూడా ఇదే చేసింది రాధిక‌. అందం అంటే ఏంటో త‌న తోటి హీరోయిన్ల‌కు చెప్పింది రాధికా.. కాదు కాదు క్లాస్ పీకింది. అందం అంటే బ‌య‌ట క‌నిపించేది కాద‌ని.. అది ఎదుటివారిని అర్థం చేసుకునే ప‌ద్ద‌తిలో ఉంటుంద‌ని..

అలా ఉన్న వాళ్ళే త‌న దృష్టిలో అంద‌మైన వాళ్ళ‌ను చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. త‌న చుట్టూ అలాంటి అంద‌మైన వాళ్లే ఉంటార‌ని.. అలాంటి వాళ్ల‌నే త‌న చుట్టూ ఉంచుకుంటాన‌ని చెప్పింది రాధికా ఆప్టే. బ‌య‌టికి వ‌చ్చేట‌ప్పుడు త‌న ఇష్ట‌మొచ్చిన‌ట్లు డ్ర‌స్ వేసుకొస్తాన‌ని.. అది చూసి త‌న‌ను విమ‌ర్శించే హ‌క్కు ఎవ్వ‌రికీ లేద‌ని చెబుతోంది ఈ భామ‌. అందం అంటే బ‌య‌టికి క‌నిపించేదే అనే భ్ర‌మ‌ల్లోంచి బ‌య‌టికి రావాలంటూ హిత‌భోద కూడా చేసింది ఈ భామ‌. ప్ర‌స్తుతం హిందీలో వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది రాధికా ఆప్టే. త‌మిళ్ లో ర‌జినీకాంత్ స‌ర‌స‌న క‌బాలిలో న‌టిస్తోంది.