రాగల 24 గంటల్లో మూవీ రివ్యూ…

రాగల 24 గంటల్లో మూవీ రివ్యూ…

ఈవీవీ తరహాలో కామెడీ చిత్రాలతో పాటు… విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి. కొంత గ్యాప్ తీసుకొని థ్రిల్లర్ జోనర్ లోకి ఎంటర్ అయ్యి రూపొందించి చిత్రమే రాగల 24 గంటల్లో. ఈ చిత్రం ట్రైలర్ బయటికి వచ్చినప్పుడే బాగా పాజిటివ్ బజ్ వచ్చింది. సత్యదేవ్, ఈషా రెబ్బా, శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ, కృష్ణభగవాన్, టెంపర్ వంశీ, అజయ్, అనురాగ్, రవి వర్మ, రవిప్రకాష్, మానిక్ రెడ్డి, అదిరే అభి తదితరులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. మరి ఈ క్రైం థ్రిల్లర్ చిత్రం ఎంత వరకు ప్రేక్షకులకు థ్రిల్ పంచిందో సమీక్షలో చూద్దాం….

కథేంటంటే….

ఫేమస్ ఫోటోగ్రాఫర్ అయిన రాహుల్(సత్యదేవ్) అనాధ అయిన విద్య( ఈషా రెబ్బా) ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొంది పెళ్లి చేసుకున్న రాహుల్ కి విద్యకు తన మిత్రుడైన గణేష్(గణేష్ వెంకట రామన్) తో ఉన్న స్నేహం,సాన్నిహిత్యం చూసి తట్టుకోలేక పోతాడు. దీనితో మెంటల్ గా అప్సెట్ అయిన రాహుల్ గణేష్, విద్య లతో వాదనకు దిగుతాడు. తారాస్థాయికి చేరిన ఆగొడవ కారణంగా రాహుల్ హత్యకు గురవుతాడు. అసలు రాహుల్ ని విద్య చంపిందా? లేక విద్య స్నేహితుడు గణేష్ చంపాడా? లేక వీరిద్దరూ కలిసి రాహుల్ ని చంపారా? వీరిద్దరూ కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా చేశారా? అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

సమీక్ష
సత్యదేవ్ మంచి నటుడిగా చాలా సినిమాలు చేశాడు. ఇందులో తన నట విశ్వరూపాన్ని చూపించాడు. కంప్లీట్ గా నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించాడు. సైకో లక్షణాలతో కూడిన విలనిజం ఇందులో చూపించాడు. ఈశా రెబ్బ భర్తగా ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ గా తన దైన స్టైల్లో నటించి మెప్పించాడు.
ఈ మూవీలో మరో స్థాయి నటనను కనబరిచారు. సైకో లక్షణాలు కలిగిన భర్త గా నెగెటివ్ పాత్రలో ఆయన జీవించారు. చాలా కాలం తరువాత నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కించుకున్న ఈషా రెబ్బా మెప్పించారు. కీలకమైన సస్పెన్సు సన్నివేశాలతో పాటు, ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన కట్టిపడేస్తుంది. ఈమూవీ తరువాత ఈషా రెబ్బా తెలుగులో ప్రాముఖ్యం ఉన్న పాత్రలు దక్కించుకునే అవకాశం కలదు. కథకు కీలకమైన పోలీస్ అధికారి పాత్ర చేసిన హీరో శ్రీరామ్ తనదైన హావభావాలతో ఆకట్టుకుంటారు.

తర్వాతి సీన్ ఏమవుతుందా అనే ఉత్కంఠ ఈ సినిమాలో కనిపిస్తుంది. కామెడీ సినిమాలు చేసే శ్రీనివాస్ రెడ్డి ఈ చిత్రాన్ని సైతం బాగా డీల్ చేయగలిగాడు. ఒక క్రైమ్ స్టోరీని తెరపై ఎక్కడా నిరాశ కలిగించకుండా నడిపించిన విధానం నచ్చుతుంది. ప్రతి సన్నివేశం కథలో భాగంగా ఆసక్తికరంగా సాగుతుంది. తక్కువ నిడివి గల పాత్రలో ముస్కాన్ సేథీ పర్వాలేదనిపించారు. ప్రధానమైన మర్డర్ సన్నివేశాన్ని బాగా రూపొందించారు. ఈషా ఇంటిలో జరిగే సీన్స్ ఆసక్తికరంగా ఉంటాయి. మర్డర్ ఎవరు చేశారనే దానిపై చాలా ట్విస్టులు వచ్చాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగా ప్లాన్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా చాలా వరకు ఓ బంగ్లాలోనే జరుగుతుంది. ఆ బంగ్లా నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను కెమెరా మెన్ తెరపై ఆవిష్కరించిన తీరుమెప్పిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే సాంగ్ ఎమోషనల్ గా బాగుంది. ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఓ స్థాయి మలుపులు, అలరించే సన్నివేశాలతో మూవీ ఎక్కడా విసుగు కలిగించకుండా తెరకెక్కించాడు.

ఓవరాల్ గా….
శ్రీనివాస్ రెడ్డి నుంచి వచ్చిన విభిన్నమైన ఎమోషనల్ క్రైం థ్రిల్లర్ ఇది. మర్డర్ మిస్టరీని బాగా తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం అలరిస్తుంది. ప్రతీ పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. మెస్మరైజ్ చేసే ట్విస్ట్ లు, మతిపోయే సన్నివేశాలు లేకున్నప్పటికీ ఎక్కడా నిరాశ పరచకుండా సాగే ఈ చిత్రం ప్రేక్షకుడికి మంచి అనుభూతిని పంచుతుంది. భారీ అంచనాలు లేకుండా వెళ్లిన ప్రేక్షకుడికి ఈ చిత్రం ఆద్యంతం అలరిస్తుంది. సో గో అండ్ వాచిట్

PB Ratng : 3.25/5