కాంగ్రెస్‌లో ల‌లిత్‌మోడీ ట్వీట్ బాంబు… రాహుల్‌గాంధీకి విందు

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ తాజా ట్వీట్‌తో మరో బాంబు పేల్చారు. కొద్ది రోజుల క్రితం ప్రియాంక‌గాంధీ త‌న ఆథిత్యం స్వీక‌రించిన‌ట్టు ట్వీట్ చేసిన మోడీ తాజాగా ట్వీట్‌తో మ‌రో దుమారం రేపాడు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన ఆతిథ్యాన్ని స్వీకరించినట్టు అందులో లలిత్ మోడీ పేర్కొన్నారు.

రాహుల్‌కు తాను ఆథిత్యం ఇచ్చిన‌ట్టు ఆథారానికి ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఈ ఫొటో చూశాక, తన ఆతిథ్యం స్వీకరించలేదని రాహుల్ గాంధీ గాని, రాబర్ట్ వాద్రా కాని చెప్పగలరా… అంటూ లలిత్ మోడీ సవాల్ విసిరాడు. ప్ర‌స్తుతం లంబ‌న్‌లో ఉంటున్న మోడీ విసురుతున్న ట్వీట్లు అధికార బీజేపీతో పాటు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ను కూడా బాగా ఇర‌కాటంలోని నెడుతున్నాయి.