పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో,రాజధాని ఆర్ట్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో,రాజధాని ఆర్ట్ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 2

నిర్మాత ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలోGVR ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్ మూవీస్ పతాకంపై, నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరవు, సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ వందేల దర్సకత్వం వహిస్తున్నారు

ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ వందేల మాట్లాడుతూ ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటూ చివరి దశలో ఉంది ఈ చిత్రానికి హైదరాబాద్ కొంపల్లి సిటీకి శివారు ప్రాంతంలో గణేష్ మాస్టర్ కోరియోగ్రఫీ నేతృత్వంలో హీరో హీరోయిన్ మద్య సాంగ్ చెయ్యడానికి సెట్ వెయ్యడం జరిగింది ఇదే సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించడం జరిగింది అని తెలిపారు
ప్రొడ్యూసర్స్, ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరవు, మాట్లాడుతూ త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ & రిలీజ్ డేట్ ని తెలియ జేస్తామని చెప్పారు
ఈ చిత్రానికి “హుషారు” ఫెమ్ గని కృష్ణతేజ్ , అఖిల ఆకర్షణ, జంటగా నటించారు తనికెళ్ళ భరణి, జీవా, జోగిబ్రదర్, అనంత్,బస్టాప్ కోటేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్, కల్పన రెడ్డి , జేజస్విని, రేణుక, బాలు , మురళి, పవన్, తదితరులు నటించారు

ఈ చిత్రానికి నిర్మాతలు ముల్లేటి కమలాక్షి గుబ్బల వెంకటేశ్వరవు, కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం వెంకట్ వందేల, సినిమాటోగ్రఫీ, పి, వంశీ ప్రకాష్, సంగీతం, సందీప్ కుమార్, స్క్రీన్ ప్లే పాటలు , డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి, ఎడిటర్, నందమూరి హరి, ఎన్టీఆర్,ఫైట్స్ రామకృష్ణ, కొరియోగ్రాఫర్స్, గణేష్ స్వామి, నండిపు రమేష్, చీఫ్ కో డైరెక్టర్, ఎల్ రామకృష్ణం రాజు, పి ఆర్ ఓ మధు వి ఆర్