రాజ‌మౌళిని అరెస్ట్ చేయండి ప్లీజ్..!

రాజ‌మౌళిని అరెస్ట్ చేయండి.. బాహుబ‌లికి ప‌నిచేసిన టీం ఎవ్వ‌ర్నీ వ‌ద‌లద్దూ. అంద‌ర్నీ అరెస్ట్ చేయండి..! ఏంటీ ఇదంతా అనుకుంటున్నారా..? ఇది మ‌నం అడుగుతున్న మాట కాదు. జంతు ప‌రిర‌క్ష‌ణ శాఖ నుంచి ప్ర‌ధాని మోడికి రాసిన లేఖ సారాంశం ఇది. ఈ మ‌ధ్యే బాహుబ‌లి 2 రెండో షెడ్యూల్ కేర‌ళ‌లో జ‌రిగింది. అక్క‌డ త్రిసూర్ అడ‌వుల్లో ఓ ఏనుగును బ‌ల‌వంతంగా హింసించి త‌మ సినిమాలో వాడుకున్నార‌ని లేఖ‌లో జంతు ప‌రిర‌క్ష‌ణ శాఖ పేర్కొంది. ఎవ‌రి అనుమ‌తి లేకుండా అలా ఓ ఏనుగును వాడుకోవ‌డం త‌ప్ప‌ని.. అలా చేసినందుకు రాజ‌మౌళితో పాటు నిర్మాత‌లు, సినిమాటోగ్ర‌ఫ‌ర్, మావ‌టి అంద‌ర్నీ శిక్షించాల‌ని కోరింది జంతు ప‌రిర‌క్ష‌ణ శాఖ ప్ర‌ధానిని కోరింది.

వన్యమృగాల చట్టం-2001లోని నిబంధనలను ఉల్లంగించారని.. అందుకే వారిపై చర్యలు తీసుకోవాలని యానిమల్ టాస్క్ ఫోర్స్ బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధానికి కార్యాలయానికి లేఖ రాసారు. ఈ విష‌యంపై రాజ‌మౌళి గానీ.. బాహుబ‌లి 2 చిత్ర‌యూనిట్ గానీ నోరు విప్ప‌డం లేదు. ఇప్ప‌టి వ‌రకు బాహుబ‌లి విష‌యంలో అన్నీ ప్ర‌శంస‌లే విన్న వాళ్ల‌కు తొలిసారి ఓ విమ‌ర్శ వ‌చ్చింది. అది కూడా మూగ జీవాల‌ని హింసిస్తున్నార‌నే విమ‌ర్శ‌. చూడాలిక‌.. దీనిపై రాజ‌మౌళి ఎలా స్పందిస్తాడో..?